Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: ఇంగ్లండ్ కొంపముంచిన బెయిర్ స్టో తప్పిదం.. బచాయించిన స్మిత్! (వీడియో)

ఓవల్: యాషెస్‌ సిరీస్ 2023లో మరో వివాదం చెలరేగింది. ఈ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్‌లో థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ ఇచ్చిన నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయంపై అభిమానులు రెండుగా విడిపోయారు. కొందరు సూపర్ నిర్ణయం అంటూ అంపైర్‌ను ప్రశంసిస్తుంటే మరికొందరు తప్పుబడుతున్నారు.

అసలేం జరిగిందంటే.. రెండో రోజు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తృటిలో రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్నాడు. వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో చేసిన తప్పిదం అతనికి కలిసొచ్చింది. క్రిస్ వోక్స్ వేసిన 78వ ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకుంది.

 Ashes 2023

ఈ ఓవర్ మూడో బంతిని వోక్స్ ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. మిడ్‌వికెట్ దిశగా ఆడిన స్మిత్ క్విక్ డబుల్‌కు ప్రయత్నించాడు. అయితే బంతిని అందుకున్న ఇంగ్లండ్ ఫీల్డర్ అంతేవేగంగా వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టోకు అందించగా అతను రనౌట్ చేశాడు. బంతి వికెట్లకు తాకే సమయానికి స్మిత్ క్రీజులోకి రాలేదు. దాంతో అందరూ రనౌటని భావించారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు సంబరాలు చేసుకోగా.. స్మిత్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. కానీ థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెల్లడించకుండా మరో కోణంలో రిప్లేలను పరిశీలించాడు.

బెయిర్ స్టో వికెట్లను కొట్టినా బెయిల్స్ ఆలస్యంగా కిందపడటాన్ని థర్డ్ అంపైర్ గుర్తించాడు. బెయిల్స్ కిందపడే సమయానికి స్మిత్ క్రీజులో బ్యాట్ పెట్టాడు. దాంతో అతను నాటౌటని థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ ప్రకటించాడు. బెయిర్ స్టో కాస్త బలంగా వికెట్లను కొట్టి ఉంటే స్మిత్ ఔటయ్యేవాడు. అయితే ఇది ఔటేనని ఇంగ్లండ్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అప్పటికి స్మిత్ 41 పరుగులు మాత్రమే చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన అతను హాఫ్ సెంచరీతో ఆసీస్ ఇన్నింగ్స్‌కు ఊపిరి పోసాడు. 123 బంతుల్లో 6 ఫోర్లతో 71 పరుగులు చేసిన స్మిత్.. ఇంగ్లండ్ ఆధిక్యానికి గండికొట్టాడు. 61/1 ఓవర్‌నైట్‌స్కోర్ రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్‌ స్మిత్ సూపర్ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ స్కోర్‌ను అధిగమించి ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ బజ్‌బాల్ బ్యాటింగ్‌తో 54.4 ఓవర్లలోనే 283 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్(91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 85) హాఫ్ సెంచరీతో రాణించాడు. బెన్ డక్కెట్(41), క్రిస్ వోక్స్(36) ధాటిగా ఆడారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ నాలుగు వికెట్లు తీయగా..జోష్ హజెల్ వుడ్, టాడ్ ముర్ఫీ రెండేసి వికెట్లు తీసారు. ప్యాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Friday, July 28, 2023, 22:49 [IST]
Other articles published on Jul 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+