Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: స్మిత్ X బెయిర్ స్టో డిష్యూం డిష్యూం! (వీడియో)

లీడ్స్: యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. మ్యాచ్‌పై పట్టు కోసం ఇరు జట్లు హోరా హోరీగా తలపడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తడబడుతోంది.

ఇక ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో మధ్య చిన్నపాటి మాటల యుద్దం నడిచింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌‌లో స్టీవ్ స్మిత్‌ను మొయిన్ అలీ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

Steve Smith Loses Cool After Jonny Bairstow

మొయిన్ అలీ వేసిన 28వ ఓవర్ నాలుగో బంతిని స్మిత్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నంగా చేయగా..అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న బెన్ డకెట్ సునాయసంగా అందుకున్నాడు. మొకాలి ఎత్తులో వచ్చిన క్యాచ్‌ను ఎలాంటి తప్పిదం చేయకుండా తీసుకున్నాడు. ఇక స్మిత్ షాట్ ఆడగానే క్యాచ్ అని గట్టిగా అరిచిన బెయిర్ స్టో... ఔటవ్వగానే 'పోరా.. మళ్లీ కలుద్దాం'అని కామెంట్ చేశాడు.

అప్పటికే చెత్త షాట్ ఆడానని అసహనంతో వెనుదిరుగుతున్న స్మిత్‌కు బెయిర్ స్టో కామెంట్స్ మరింత ఆగ్రహం తెప్పించాయి. దాంతో 'ఏంరా అరేయ్ ఏమో అంటున్నావ్?'అని గట్టిగా అరిచాడు. దానికి బెయిర్ స్టో.. 'నేను ఏమన్నా ఔటైనందుకు ఛీర్స్ చెబుతూ మళ్లీ కలుద్దామంటున్నా'అని బదులిచ్చాడు. ఈ సంఘటన కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది.

ఇక లార్డ్స్ టెస్ట్‌లో బెయిర్ స్టో స్టంపౌట్‌పై వివాదం చెలరేగడం.. ఆసీస్ అడ్డదారిలో విజయం సాధించిందని ఇంగ్లండ్ ఆరోపిస్తుండటం ఇరు జట్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనేలా చేశాయి. విజయమే లక్ష్యంగా ఇరు జట్లు కసిగా ఆడుతుండటంతో ప్రతీ చిన్న విషయం కూడా వాగ్వాదానికి దారితీస్తోంది.

శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 116/4తో నిలిచిన ఆసీస్.. ప్రస్తుతం 142 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో ట్రావిస్ హెడ్‌ (18 బ్యాటింగ్‌), మిచెల్‌ మార్ష్‌ (17 బ్యాటింగ్‌) ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 68/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌.. ప్యాట్ కమిన్స్‌ (6/91) దెబ్బకు 237 పరుగులకే కుప్పకూలింది.

కెప్టెన్‌ బెన్ స్టోక్స్‌ (108 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 80) మరోసారి ఒంటరి పోరాటంతో జట్టును ఆదుకోవడంతో పాటు ఇజ్జత్ కాపాడాడు. మిగతా మూడు రోజుల ఆటలో వర్షం పడే సూచనలు ఉన్న నేపథ్యంలో మ్యాచ్‌ మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.

Story first published: Saturday, July 8, 2023, 11:15 [IST]
Other articles published on Jul 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+