Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: 'ఇదేందయ్యా ఇది.. నేను ఏడ చూడలే'.. హ్యారీ బ్రూక్ వికెట్‌పై పాంటింగ్ కామెంట్స్! (వీడియో)

బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను దరిద్రం వెంటాడుతోంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో దారుణంగా విఫలమైన హ్యారీ బ్రూక్.. యాషెస్ సిరీస్‌ను కూడా పేలవ ఆటతీరుతో ప్రారంభించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ విచిత్రకర రీతిలో ఔటయ్యాడు. ఇలా కూడా ఔటవుతారా? ఇదెక్కడి దరిద్రం అని చెప్పుకునే రీతిలో వెనుదిరిగాడు.

నాథన్ లయన్ వేసిన 38వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఓవర్ రెండో బంతిని నాథన్ లయన్ షార్ట్ బౌన్సర్‌గా వేయగా.. బ్రూక్ ప్యాడ్లను తాకిన బంతి పైకి గాల్లోకి లేచింది. అనంతరం అతన్ని వీపు భాగాన్ని తాకుతూ వికెట్లను గిరాటేసింది.

Ashes 2023

ఈ ఊహించని ఘటనతో బ్రూక్ షాకవ్వగా.. ఆసీస్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. కామెంటేటర్లు సైతం హ్యారీ బ్రూక్ ఔటైన తీరును చూసి బిత్తరపోయారు. 'క్రికెట్‌లో ఎన్నో రకాలైన డిసిమిసల్స్ చూశాను కానీ.. ఇలా ఔటవ్వడం ఎప్పుడూ చూడలేదు'అని రికీ పాంటింగ్ వ్యాఖ్యానించాడు. విచిత్రకరమైన ఈ డిసిమిసల్‌పై అభిమానులు కూడా తమదైన శైలిలో జోకులు పేల్చుతున్నారు.

'గాశారం బాలేకపోతే.. ఇలానే ఉంటుంది రా హ్యారీ బ్రూక్'అని ఒకరు, 'ఇదేందయ్యా ఇది.. నేను ఏడ చూడలే' అన్నట్లు పాంటింగ్ కామెంట్స్ ఉన్నాయని మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్‌లో పట్టిన దరిద్రం.. హ్యారీ బ్రూక్‌ను వీడటం లేదని సెటైర్లు పేల్చుతున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి 176 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ జాక్ క్రాలీ(61) మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

బెన్ డకెట్(12), ఓలీపోప్(31), హ్యారీ బ్రూక్(32), బెన్ స్టోక్స్(1) వెనుదిరగగా.. జోరూట్(45 బ్యాటింగ్), జానీ బెయిర్ స్టో(6 బ్యాటింగ్) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్, జోష్ హజెల్ వుడ్ రెండేసి వికెట్లు తీయగా.. స్కాట్ బోలాండ్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Friday, June 16, 2023, 19:54 [IST]
Other articles published on Jun 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+