Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: పాపం ఇంగ్లండ్.. డ్రా దిశగా నాలుగో టెస్ట్!

మాంచెస్టర్: 'అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని'అన్నట్లు తయారైంది ఇంగ్లండ్ పరిస్థితి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో విజయం దిశగా నడుస్తున్న ఇంగ్లండ్‌కు వరుణుడు ఊహించని షాకిచ్చాడు. పదే పదే అంతరాయం కలిగిస్తూ ఆసీస్‌‌కు అండగా నిలుస్తున్నాడు.

నాలుగో రోజు 60 ఓవర్ల ఆటను మింగేసిన వరణుడు.. చివరి రోజు అంతరాయం కలిగిస్తున్నాడు. వర్షం కారణంగా ఐదో రోజు ఆట ఇంకా ప్రారంభం కాలేదు. దాంతో కీలకమైన నాలుగో టెస్ట్ డ్రా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 275 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ నాలుగో రోజు ఆట ఆగిపోయే సమయానికి 5 వికెట్లకు 214 పరుగులు చేసింది.

Ashes 2023: పాపం ఇంగ్లండ్.. డ్రా దిశగా నాలుగో టెస్ట్!

క్రీజులో మిచెల్ మార్ష్(31 బ్యాటింగ్), కామెరూన్ గ్రీన్(3 బ్యాటింగ్) ఉన్నారు. ఇంకా ఆ జట్టు 61 పరుగుల వెనుకంజలో ఉంది. వర్షం కారణంగా తొలి సెషన్ ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఆసీస్‌కు కలిసిరానుంది. ఆ జట్టు డ్రా కోసం ఆడనుంది.

ఒకవేళ ఈ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిస్తే ఐదు టెస్ట్‌ల యాషెస్ సిరీస్ ఆసీస్ కైవసం అవుతోంది. తొలి రెండు టెస్ట్‌లు గెలిచిన ఆ జట్టు.. మూడో టెస్ట్‌లో ఓడిపోయింది. 2-1తో లీడ్‌లో ఉన్న ఆసీస్.. నాలుగో టెస్ట్ డ్రా అయితే చివరి టెస్ట్‌లో ఓడినా.. డిఫెండింగ్ ఛాంపియన్‌గా టైటిల్ రిటైన్ చేసుకుంటుంది.

ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 317 పరుగులకు కుప్పకూలింది. మిచెల్ మార్ష్(51), మార్నస్ లబుషేన్(51) హాఫ్ సెంచరీలతో రాణించగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. క్రిస్ వోక్స్(5/62) ఐదు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా.. స్టువర్డ్ బ్రాడ్ రెండు, జేమ్స్ అండర్సన్, మార్క్ వుడ్, మొయిన్ అలీ తలో వికెట్ తీసారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. బజ్‌బాల్ బ్యాటింగ్‌తో 592 పరుగుల భారీ స్కోర్ చేసింది. జాక్ క్రాలీ(189) తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకోగా.. జానీ బెయిర్ స్టో(99 నాటౌట్) సెంచరీ మిస్ చేసుకున్నాడు. జోరూట్(84), హ్యారీ బ్రూక్(61), బెన్ స్టోక్స్(51), మొయిన్ అలీ(54) హాఫ్ సెంచరీలతో రాణించారు.

ఆసీస్ బౌలర్లలో హజెల్ వుడ్(5/126) ఐదు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ప్యాట్ కమిన్స్‌కు ఓ వికెట్ దక్కింది. రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 214/5తో నిలిచింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(18), డేవిడ్ వార్నర్(28)లతో పాటు స్టీవ్ స్మిత్(17), ట్రావిస్ హెడ్(1) విఫలమవ్వగా.. మార్నస్ లబుషేన్(111) సెంచరీతో ఆదుకున్నాడు.

Story first published: Sunday, July 23, 2023, 16:17 [IST]
Other articles published on Jul 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+