Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: డబ్ల్యూటీసీ హీరోకు దక్కని చోటు!

బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తెలిపాడు. ఈ మ్యాచ్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూశామని చెప్పిన బెన్ స్టోక్స్.. వ్యక్తిగతంగా ఇది తనకు ప్రత్యేక అనుభూతినిస్తోందని చెప్పాడు.

టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ తీసుకునేవాళ్లమని చెప్పిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. తప్పని పరిస్థితుల్లో తుది జట్టులో ఒక మార్పు చేయాల్సి వచ్చిందన్నాడు. మిచెల్ స్టార్క్ స్థానంలో జోష్ హజెల్‌వుడ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు చెప్పాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో స్టార్క్ అద్భుతంగా ఆడినా.. మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ కనబర్చినా జోష్ హజెల్ వుడ్ కోసం ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నాడు.

 Ashes 2023

వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగానే స్టార్క్‌కు రెస్ట్ ఇచ్చామని తెలిపాడు. సరైన ప్రిపరేషన్స్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిచామని, ఈ సిరీస్‌లో కూడా అదే తరహా ప్రణాళికలతో బరిలోకి దిగుతున్నామని ప్యాట్ కమిన్స్ తెలిపాడు.

భారత్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో 209 పరుగుల తేడాతో విజయాన్నందుకున్న ఆస్ట్రేలియా విశ్వ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో స్టార్క్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో కీలక పరుగులు చేసిన స్టార్క్ బౌలింగ్ రెండు వికెట్లు తీసాడు. మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్‌ కనబర్చిన స్టార్క్‌ను పక్కనపెట్టడంపై ఆసీస్ అభిమానులు ఫైరల్ అవుతున్నారు.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే ఓపెనర్ బెన్ డకెట్(12) వికెట్ కోల్పోయింది. జోష్ హజెల్ వుడ్ బౌలింగ్‌లో బెన్ డక్కెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. జాక్ క్రాలీ, ఓలిపోప్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు.

తుది జట్లు:

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ(కీపర్), ప్యాట్ కమిన్స్, నాథన్ లయన్, జోష్ హజెల్ వుడ్, స్కాట్ బోలాండ్

ఇంగ్లండ్: బెన్ డక్కెట్, జాక్ క్రాలీ, ఓలీ పోప్, జోరూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, స్టువర్ట్ బ్రాడ్, ఓలీ రాబిన్సన్, జేమ్స్ అండర్సన్

Story first published: Friday, June 16, 2023, 17:06 [IST]
Other articles published on Jun 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+