Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: బెన్ స్టోక్స్ ఘోర తప్పిదం చేశాడు: మైకేల్ వాన్

లండన్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడాన్ని ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తప్పుబట్టాడు. తాను కెప్టెన్‌గా ఉండి ఉంటే అస్సలు డిక్లేర్ చేసేవాడిని కాదని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌.. జోరూట్(152 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 118 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌ను 393/8వద్ద డిక్లేర్ చేసింది.

అయితే అజేయ శతకంతో జోరూట్ క్రీజులో ఉండగా.. తొలి రోజే మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. బెన్ స్టోక్స్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇంగ్లండ్ బజ్‌బాల్ కాన్సెప్ట్‌ను కొనియాడితే.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు.

 Ashes 2023:

ఈ క్రమంలోనే బెన్ స్టోక్స్ నిర్ణయంపై స్పందించిన మైకేల్ వాన్.. ఇంగ్లండ్ జట్టు ఏ టీమ్ చేయని సాహసాన్ని చేసేందుకు ప్రయత్నిస్తుందన్నాడు. 'నేను కెప్టెన్‌గా ఉండి ఉంటే అస్సలు డిక్లేర్ చేయకపోయేవాడిని. ఏం జరుగుతుందో మీకు తెలియదు. ఇంతకు ముందు ఏ జట్టు చేయని సాహసాన్ని చేయడానికి ఇంగ్లండ్‌ ప్రయత్నిస్తోంది. నేను కెప్టెన్‌గా ఉంటే జో రూట్‌ క్రీజులో ఉన్నందున జట్టుకు మరిన్ని పరుగులు కావాలనుకునేవాడిని' అని మైకేల్ వాన్ అన్నాడు.

బెన్‌స్టోక్స్‌ తీసుకున్న నిర్ణయం చాలామంది క్రికెట్ పండితులను షాక్‌ గురిచేసినప్పటికీ.. తాను మాత్రం ఎలాంటి ఆశ్చర్యానికి గురికాలేదని ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌ స్టో పేర్కొన్నాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కూడా స్టోక్స్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. పిచ్ కండిషన్స్ బ్యాటింగ్‌కు ఇంకా అనుకూలంగా మారుతాయన్నాడు.

అయితే తొలి రోజు ఆటలో అలిసిపోయిన ఆసీస్ ఆటగాళ్లను బ్యాటింగ్‌కు ఆహ్వానించి వికెట్ తీయాలనే ఆలోచనతో ఇంగ్లండ్ డిక్లేర్ చేసింది. అయితే బ్యాడ్ లైట్ కారణంగా 4 ఓవర్ల ఆటనే సాధ్యం కావడంతో ఆసీస్ 14/0తో తొలి రోజు ఆటను ముగించింది.

ఇక రెండో రోజు ఆట ప్రారంభంలోనే డేవిడ్ వార్నర్(9), మార్నస్ లబుషేన్(0) వికెట్లను ఆసీస్ కోల్పోయింది. స్టువర్ట్ బ్రాడ్ దెబ్బకు మార్నస్ లబుషేన్ గోల్డెన్ డకౌటవ్వగా.. డేవిడ్ వార్నర్ 18వసారి అతని బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

స్టీవ్ స్మిత్‌ను బెన్ స్టోక్స్ వికెట్ల ముందు బోల్తా కొట్టించగా.. క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్‌తో కలిసి ఉస్మాన్ ఖవాజా జట్టును ఆదుకున్నాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. హాప్ సెంచరీ పూర్తి చేసుకున్న ట్రావిస్ హెడ్(50)ను మొయిన్ అలీ పెవిలియన్ చేర్చగా.. క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్ సాయంతో ఉస్మాన్ ఖవాజా(84 బ్యాటింగ్) పోరాడుతున్నాడు.

Story first published: Saturday, June 17, 2023, 20:34 [IST]
Other articles published on Jun 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+