Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: ఆసీస్ సింహం లేదు.. ఇంగ్లండ్‌ విజయానికి ఇదే లక్కీ ఛాన్స్!

లార్డ్స్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో విజయం సాధించేందుకు ఇదే సువర్ణవకాశమని ఆ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తెలిపాడు. ప్రస్తుతం బ్యాటింగ్‌కు అనుకూలించే కండిషన్స్ ఉన్నాయని, తర్వాత వర్షంతో పరిస్థితులు బౌలింగ్ అనుకూలంగా మారనుండటం చూస్తుంటే ఇంగ్లండ్ విజయానికి ఇదే సువర్ణవకాశమని తెలిపాడు.

'ప్రస్తుత కండిషన్స్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండగా.. తర్వాత లైట్ వర్షంతో పాటు మబ్బులు కమ్మేసిన పిచ్‌పై ఇంగ్లండ్ బౌలింగ్ చేయడం.. నాథన్ లయన్ ఆడే పరిస్థితి లేకపోవడం చూస్తుంటే.. ఈ వారం ఇంగ్లండ్‌కు గొప్ప విజయం దక్కుతుందనిపిస్తోంది.'అని మైఖేల్ వాన్ ట్వీట్ చేశాడు.

 Ashes 2023: Michael Vaughan says No Lyon makes this a genuine chance of a great victory for England

అదేందో కానీ మైఖేల్ వాన్ ట్వీట్ చేసిన కాసేపిటికే బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై ఇంగ్లండ్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. 278/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 325 పరుగులకు కుప్పకూలింది. 47 పరుగుల వ్యవధిలోనే చివరి 6 వికెట్లు కోల్పోయింది.

ఓవర్‌నైట్ బ్యాటర్లు బెన్ స్టోక్స్(17) దారుణంగా విఫలమవ్వగా.. హ్యారీ బ్రూక్(50) హాఫ్ సెంచరీ చేసి వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్(3/88) మూడు వికెట్లు తీసాడు. జోరూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్ ముగ్గురిని పెవిలియన్ చేర్చి ఆసీస్‌కు 91 పరుగుల ఆధిక్యాన్ని అందించాడు. ఇతర బౌలర్లలో జోష్ హజెల్ వుడ్, ట్రావిస్ హెడ్ రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, నాథన్ లయన్, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ తీసారు.

ఒక్క పరుగు వ్యవధిలోనే చివరి మూడు వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఓలీ రాబిన్సన్(9), స్టువర్ట్ బ్రాడ్(12), జోష్ టంగ్(1) ఒక్క పరుగు వ్యవధిలోనే వెనుదిరిగారు. దాంతో ఇదేం బజ్‌బాల్ బ్యాటింగ్ అంటూ ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు. ఇలా వరుసగా వికెట్లు కోల్పోవడంపై మైఖేల్ వాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదెక్కడి బజ్‌బాల్ అప్రోచ్ అని మండిపడ్డాడు.

ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్‌(184 బంతుల్లో 15 ఫోర్లతో 110) సెంచరీతో చెలరేగగా.. ట్రావిస్ హెడ్(73 బంతుల్లో 14 ఫోర్లతో 77), డేవిడ్ వార్నర్(66) హాఫ్ సెంచరీలతో రాణించారు.

Story first published: Friday, June 30, 2023, 20:04 [IST]
Other articles published on Jun 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+