Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: జోరూట్ సింగిల్ హ్యాండ్ క్యాచ్.. బిత్తరపోయిన లబుషేన్(వీడియో)

ఒవల్: ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. యాషెస్ 2023లో భాగంగా ఆస్ట్రేలియా‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో స్టన్నింగ్ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. జో రూట్ అసాధారణ క్యాచ్‌కు మార్నస్ లబుషేన్(9) నిరాశగా పెవిలియన్ చేరాడు. రెండో రోజు ఆట తొలి సేషన్‌లో మార్క్‌వుడ్ వేసిన 43వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఓవర్ ఐదో బంతిని ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. లబుషేన్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్ కీపర్, ఫస్ట్ స్లిప్ మధ్యలోకి దూసుకెళ్లింది. బంతి రాకను గమనించిన జోరూట్ ఎడమవైపు సూపర్ డైవ్‌తో బంతిని సింగిల్ హ్యాండ్‌తో అద్భుతంగా అందుకున్నాడు. ఈ సంచలన క్యాచ్‌ను చూసి లబుషేన్ బిత్తరపోయాడు.

 Ashes 2023

ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ కాగా.. జోరూట్ ఫీల్డింగ్ విన్యాసానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. జోరూట్ సింగిల్ హ్యాండ్ క్యాచ్.. పోలా అదిరిపోలా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ సిరీస్‌లోనే ఇదో అద్భుతమైన క్యాచ్ అని కొనియాడుతున్నారు. జోరూట్ సూపర్ క్యాచ్‌తో జిడ్డుగా ఆడుతున్న లబుషేన్‌ను ఔట్ చేసి పుణ్యం కట్టుకున్నాడని కామెంట్ చేస్తున్నారు.

61/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్ జిడ్డు బ్యాటింగ్‌తో అభిమానులను విసిగించింది. ఓవైపు ఇంగ్లండ్ బజ్‌బాల్ కాన్సెప్ట్‌తో వన్డే తరహా బ్యాటింగ్‌తో చెలరేగితే ఆసీస్ మాత్రం అసలు సిసలు టెస్ట్ ఫార్మాట్ రుచి చూపిస్తూ జిడ్డుగా ఆడుతోంది.

ముఖ్యంగా మార్నస్ లబుషేన్ పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమయ్యాడు. 82 బంతులు ఆడిన అతను 9 పరుగులు చేసాడంటేనే ఎంత జిడ్డుగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఉస్మాన్ ఖవాజా కూడా జిడ్డు బ్యాటింగ్‌తో విసగిస్తున్నాడు. లబుషేన్‌‌ను రూట్ స్టన్నింగ్ క్యాచ్‌తో మార్క్ వుడ్ పెవిలియన్ చేర్చగా.. క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్(13 బ్యాటింగ్), ఉస్మాన్ ఖవాజా(47 బ్యాటింగ్) ఆచితూచి ఆడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ బజ్‌బాల్ బ్యాటింగ్‌తో 54.4 ఓవర్లలోనే 283 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్(91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 85) హాఫ్ సెంచరీతో రాణించాడు. బెన్ డక్కెట్(41), క్రిస్ వోక్స్(36) ధాటిగా ఆడారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ నాలుగు వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్, టాడ్ ముర్ఫీ రెండేసి వికెట్లు తీసారు. ప్యాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Friday, July 28, 2023, 18:37 [IST]
Other articles published on Jul 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+