Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: ఆసీస్ కొంపముంచిన నోబాల్.. బచాయించిన డేంజరస్ బ్యాటర్!

లార్డ్స్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్(184 బంతుల్లో 15 ఫోర్లతో 110) సెంచరీతో చెలరేగగా.. ట్రావిస్ హెడ్(73 బంతుల్లో 14 ఫోర్లతో 77), డేవిడ్ వార్నర్(66) హాఫ్ సెంచరీలతో రాణించారు.

ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్, జోష్ టంగ్ మూడేసి వికెట్లు తీయగా.. జోరూట్ రెండు వికెట్లు పడగొట్టాడు. జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ తలో వికెట్ తీసారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ బజ్‌బాల్ కాన్సెప్ట్‌తో దుమ్మురేపుతోంది. వన్డే తరహా బ్యాటింగ్‌తో పరుగుల మోత మోగిస్తుంది. వికెట్లు పడినా.. ఓవర్‌‌కు 5 పరుగుల చొప్పున బ్యాటింగ్ చేస్తోంది.

Joe root Survives cameron Green No ball

ఓపెనర్లు జాక్ క్రాలీ(48), బెన్ డక్కెట్(95 బ్యాటింగ్) మంచి శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించారు. అనంతరం ఓలీపోప్(42) కూడా ధాటిగా ఆడాడు. రెండో వికెట్‌కు 97 పరుగులు జోడించాడు. ఇక క్రీజులోకి వచ్చిన జోరూట్‌ ఆదిలోనే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

కామెరూన్ గ్రీన్ చేసిన తప్పిదం అతనికి కలిసొచ్చింది. ఎదుర్కొన్న రెండో బంతికే అతను కీపర్‌కు క్యాచ్ ఇవ్వగా.. అది నోబాల్‌గా తేలింది. దాంతో జోరూట్ ఊపిరి పీల్చుకోగా.. ఆసీస్ ఆటగాళ్లు నిరాశకు గురయ్యారు. ఈ అవకాశంతో జోరూట్ ఆచితూచి ఆడుతున్నాడు. మరోవైపు బెన్ డక్కెట్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో బ్యాటర్లు స్వేచ్చగా ఆడుతున్నారు.

Story first published: Thursday, June 29, 2023, 22:03 [IST]
Other articles published on Jun 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+