For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ashes 2023: ఏం గుండెరా అది.. తొలి బంతికే రివర్స్ స్కూప్ షాటా? (వీడియో)

బర్మింగ్‌హామ్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. 28/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. బజ్‌బాల్ బ్యాటింగ్‌తో దూకుడుగా ఆడుతోంది. 30 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లకు 143 పరుగులు చేసింది. క్రీజులో హ్యారీబ్రూక్(42 బ్యాటింగ్)తో పాటు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఉన్నాడు.

ఓవర్‌నైట్ బ్యాటర్ ఓలీపోప్(14) విఫలమైనా.. ఫస్ట్ ఇన్నింగ్స్ సెంచరీ హీరో జోరూట్ రాణించాడు. వన్డే తరహా బ్యాటింగ్‌తో ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అయితే నాలుగో రోజు ఆటలో తొలి బంతినే జోరూట్ రివర్స్ స్కూప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ప్యాట్ కమిన్స్ వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను రివర్స్ స్కూప్ షాట్‌తో సిక్సర్‌గా తరలించానుకున్నాడు.

Joe Root played reverse scoop for a SIX stuns everyone.

కానీ బంతి మిస్సయ్యింది. అయితే తొలి బంతినే జోరూట్ రివర్స్ స్కూప్ షాట్‌కు ప్రయత్నించడం చర్చనీయాంశమైంది. తొలి బంతికి విఫలమైనా.. ఇదే ఓవర్ ఐదో బంతిని రివర్స్ స్కూప్ షాట్‌తో సిక్సర్‌గా మలిచాడు. ప్రస్తుతం ఈ సిక్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక జోరూట్ మంచి జోరు మీదున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

కొందరైతే ఏం గుండెరా అది.. తొలి బంతికే రివర్స్ స్కూప్ షాటా? అంటూ సినిమా డైలాగ్స్‌తో మీమ్స్ షేర్ చేస్తున్నారు. హాఫ్ సెంచరీకి చేరువైన జోరూట్‌(46)ను నాథన్ లయన్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 52 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తొలి ఇన్నింగ్స్‌లోనూ జోరూట్ రివర్స్ స్కూప్ షాట్లతో సిక్స్‌లు కొట్టి అభిమానులను అలరించాడు.

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 393/8 వద్ద డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు కుప్పకూలడంతో ఇంగ్లండ్‌కు ఏడు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.

సంక్షిప్త స్కోర్లు:

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 393/8 డిక్లేర్డ్

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 386 ఆలౌట్

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 28/2

Story first published: Monday, June 19, 2023, 17:38 [IST]
Other articles published on Jun 19, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+