For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ashes 2023: పాపం జోరూట్.. సెంచరీ జస్ట్ మిస్! బజ్‌బాల్‌తో భారీ లక్ష్యం దిశగా ఇంగ్లండ్!

లండన్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోరూట్(106 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 91) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో దుమ్మురేపిన జోరూట్.. శతకానికి 9 పరుగుల దూరంలో ఔటయ్యాడు. టాడ్ మర్ఫీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఇక క్రీజులో ఉన్నంత సేపు జోరూట్ ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వన్డే తరహా బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు. 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసుకున్న జోరూట్.. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక 50+ స్కోర్లు నమోదు చేసిన ఇంగ్లండ్ ప్లేయర్‌గా అలిస్టర్ కుక్ సరసన నిలిచాడు. ఈ ఇద్దరూ ఇంగ్లండ్ తరఫున టెస్ట్‌ల్లో 90 సార్లు 50+ పరుగులు చేశారు.

 Ashes 2023:

హాఫ్ సెంచరీ అనంతరం అదే జోరును కొనసాగించిన జోరూట్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ మర్ఫీ అతని ఇన్నింగ్స్‌కు తెరదించాడు. ఇక బజ్‌బాల్‌తో దూకుడుగా ఆడుతున్న ఇంగ్లండ్ భారీ లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది.

మూడో రోజు ఫ్రెష్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. తొలి సెషన్‌లో 25 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ వికెట్ నష్టపోయి 130 పరుగులు చేసింది. రెండో సెషన్‌లోనూ అదే జోరు కొనసాగించిన ఇంగ్లండ్.. జాక్ క్రాలీ(73) బెన్ స్టోక్స్(42), హ్యారీ బ్రూక్(7) వికెట్లు కోల్పోయినా బ్యాటింగ్‌లో దూకుడు తగ్గించలేదు. ఫస్ట్ డౌన్‌లోనే బ్యాటింగ్‌కు దిగిన స్టోక్స్ ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేసాడు.

జానీ బెయిర్ స్టో, జోరూట్ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 110 పరుగులు జోడించారు. ఆ కొద్ది సేపటికే జానీ బెయిర్ స్టో(78) కూడా ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన క్రిస్ వోక్స్, మొయిన్ అలీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పటికే ఇంగ్లండ్ ఆధిక్యం 351 పరుగులు ధాటింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 283 పరుగులకు ఆలౌటవ్వగా.. ఆసీస్ 295 పరుగులకు కుప్పకూలింది.

Story first published: Saturday, July 29, 2023, 22:40 [IST]
Other articles published on Jul 29, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+