For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ashes 2023: జోరూట్ స్టన్నింగ్ డెలివరీ.. బిత్తరపోయిన లబుషేన్ (వీడియో)

మాంచెస్టర్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. నాలుగో రోజు ఆటకు వర్షం పదే పదే అంతరాయం కలిగిస్తుండగా.. ఇంగ్లండ్ విజయం దిశగా దూసుకెళ్తోంది. 113/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ను మార్నస్ లబుషేన్ ఆదుకున్నాడు.

173 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 111 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్‌తో కలిసి ఐదో వికెట్‌కు 103 పరుగులు జోడించాడు. క్రీజులో పాతుకుపోయిన మార్నస్ లబుషేన్‌ను జోరూట్ విడదీసాడు.

Ashes 2023: Joe Root gets Marnus Labuschagne with stunning delivery

సూపర్ డెలివరీతో కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. అంపైర్ ఔటివ్వకపోవడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు డీఆర్‌ఎస్ ద్వారా ఫలితాన్ని రాబట్టారు. క్రీజులోకి కామెరూన్ గ్రీన్ రాగా.. మళ్లీ వర్షం రావడంతో అంపైర్లు ఆటను నిలిపివేసారు. ఇంగ్లండ్ ఇంకా 61 పరుగుల వెనుకంజలో ఉంది. వీలైనంత త్వరగా మిగిలిన ఐదు వికెట్లు తీసి విజయాన్నందుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. మరోవైపు ఆసీస్ మాత్రం డ్రా‌తోనైనా గట్టెక్కాలనుకుంటోంది.

ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 317 పరుగులకు కుప్పకూలింది. మిచెల్ మార్ష్(51), మార్నస్ లబుషేన్(51) హాఫ్ సెంచరీలతో రాణించగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. క్రిస్ వోక్స్(5/62) ఐదు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా.. స్టువర్డ్ బ్రాడ్ రెండు, జేమ్స్ అండర్సన్, మార్క్ వుడ్, మొయిన్ అలీ తలో వికెట్ తీసారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. బజ్‌బాల్ బ్యాటింగ్‌తో 592 పరుగుల భారీ స్కోర్ చేసింది. జాక్ క్రాలీ(189) తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకోగా.. జానీ బెయిర్ స్టో(99 నాటౌట్) సెంచరీ మిస్ చేసుకున్నాడు. జోరూట్(84), హ్యారీ బ్రూక్(61), బెన్ స్టోక్స్(51), మొయిన్ అలీ(54) హాఫ్ సెంచరీలతో రాణించారు.

ఆసీస్ బౌలర్లలో హజెల్ వుడ్(5/126) ఐదు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ప్యాట్ కమిన్స్‌కు ఓ వికెట్ దక్కింది. 275 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ ఓటమిని తప్పించుకునేందుకు పోరాడుతోంది.

Story first published: Saturday, July 22, 2023, 22:20 [IST]
Other articles published on Jul 22, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+