Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: బచాయించిన బజ్‌బాల్.. విజయానికి వర్షం అడ్డంకి!

బర్మింగ్‌హామ్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. దాంతో చివరి రోజు ఆట ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం వర్షం కురుస్తుండటంతో మైదానాన్ని కవర్లతో కప్పేసారు. ఇప్పటికే తొలి సెషన్ ఆటను అంపైర్లు రద్దు చేశారు. అంతేకాకుండా ఎడ్జ్‌బాస్టన్ గ్రౌండ్‌ను నల్లని మబ్బులు కమ్మేసాయి. వర్షం ఆగితేగానీ మ్యాచ్ ప్రారంభమయ్యే పరిస్థితి లేదు.

వర్షం ఆగిన వెంటనే ఆట కోసం మైదానాన్ని సిద్దం చేసే టెక్నాలజీ ఎడ్జ్‌బాస్టన్ గ్రౌండ్‌లో ఉంది. చివరి రోజు ఆట కొనసాగితేనే ఈ మ్యాచ్ ఫలితం తేలేలా ఉంది. తొలి రెండు రోజు బ్యాటర్ల హవా నడిచిన ఈ మైదానంలో మూడో రోజు వర్షం అంతరాయం కలిగించింది. దాంతో పిచ్ ఒక్కసారి బౌలర్లకు అనుకూలంగా మారింది.

First Session WASHED OUT at rainy Edgbaston

28/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 273 పరుగులకు కుప్పకూలింది. జోరూట్(46), హ్యారీ బ్రూక్(46), బెన్ స్టోక్స్(43) రాణించారు. వేగంగా ఆడే క్రమంలో ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యం కలుపుకొని ఆసీస్ ముందు 281 పరుగుల లక్ష్యం నమోదవ్వగా.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 107/3 నిలిచింది.

ఆసీస్ విజయానికి ఇంకా 174 రన్స్ అవసరం కాగా.. ఇంగ్లండ్ విజయానికి ఏడు వికెట్లు కావాలి. మైదానాన్ని మబ్బులు కమ్మేయడం, వర్షం పడటంతో పిచ్ బౌలర్లకు అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక వేళ ఆట ప్రారంభమైతే ఇంగ్లండ్ బౌలర్లకు అడ్వాంటేజ్‌గా మారనుంది. అయితే వర్షం రావడం ఇంగ్లండ్ జట్టుకు కలిసొచ్చిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

వర్షం అంతరాయం లేకుండా చివరి రోజు ఆట కొనసాగితే ఆసీస్ సునాయసంగా గెలిచేదని అభిప్రాయపడుతున్నారు. మొత్తం బజ్‌బాల్ బచాయించిందని సెటైర్లు పేల్చుతున్నారు.

సంక్షిప్త స్కోర్లు:

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 393/8 డిక్లేర్డ్

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 386 ఆలౌట్

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 273 ఆలౌట్

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 107/3

Story first published: Tuesday, June 20, 2023, 16:23 [IST]
Other articles published on Jun 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+