Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: బెన్ స్టోక్స్ మార్క్ కెప్టెన్సీ.. ఆరుగురు ఫీల్డర్లతో సెంచరీ హీరో ఆటకట్టు! (వీడియో)

బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన మార్క్ సారథ్యంతో అందర్ని ఆకట్టుకుంటున్నాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బెన్ స్టోక్స్ కెప్టెన్సీకి అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు ఫిదా అవుతున్నారు. బజ్‌బాల్ కాన్సెప్ట్‌తో ధాటిగా ఆడి తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన స్టోక్స్.. తన సాహసోపేతమైన నిర్ణయంతో అందర్నీ షాక్‌కు గురి చేశాడు. అనంతరం ఫీల్ట్ సెటెప్‌లో తనదైన మార్క్ చూపించాడు.

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌కు స్లిప్‌లో నలుగురు.. లెగ్ స్లిప్‌లో మరో ఇద్దరు.. షార్ట్ లెగ్‌లో ఓ ఫీల్డర్‌ను పెట్టి పెవిలియన్‌కు చేర్చిన స్టోక్స్.. మూడో రోజు ఆటలో సెంచరీ హీరో ఉస్మాన్ ఖవాజాను అదే తరహా ఫీల్డింగ్‌తో ఔట్ చేశాడు. ఆన్‌డ్రైవ్, కవర్ డ్రైవ్ షాట్స్ ఎక్కువగా ఆడుతున్న ఉస్మాన్ ఖవాజాకు 30 యార్డ్ సర్కిల్‌లోనే ఆరుగురు ఫీల్డర్లను క్యాచింగ్ పొజిషన్‌లో పెట్టి ఒత్తిడికి గురి చేశాడు.

Fans praises Ben Stokes as he sets up Usman Khawaja with Box Cricket fielding.

ఖవాజా షాట్ ఆడే ప్రాంతాల్లో స్టోక్స్ ఫీల్డ్ సెట్ చేయడంతో అతను గందరగోళానికి గురయ్యాడు. దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన ఖవాజా స్టెప్ ఔటై భారీ షాట్ ఆడబోయి వికెట్ సమర్పించుకున్నాడు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

బెన్ స్టోక్స్ కెప్టెన్సీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఫీల్డ్ సెటప్‌లో బెన్ స్టోక్స్ కొత్త విప్లవానికి తెరలేపుతున్నాడని కొనియాడుతున్నారు. ఆస్ట్రేలియా బ్యాటర్లను తన ఫీల్డింగ్‌తోనే ప్యాక్ చేస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు.

311/5 ఓవర్‌నైట్ స్కోర్ మూడో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు కుప్పకూలింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా(321 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 141), అలెక్స్ క్యారీ(99 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 66)లను జేమ్స్ అండర్సన్, ఓలీ రాబిన్సన్ ఔట్ చేశారు.

ప్యాట్ కమిన్స్(62 బంతుల్లో 3 సిక్స్‌లతో 38) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా ఓలీ రాబిన్సన్ పెవిలియన్ చేర్చాడు. ఇంగ్లండ్‌కు 7 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, ఓలీ రాబిన్సన్ మూడేసి వికెట్లు తీయగా.. మొయిన్ అలీ రెండు వికెట్లు పడగొట్టాడు. అండర్సన్, బెన్ స్టోక్స్‌కు ఒక్కో వికెట్ దక్కింది.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు జాక్ క్రాలీ(7), బెన్ డక్కెట్(19) దారుణంగా విఫలమయ్యారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 393/8 వద్ద డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Sunday, June 18, 2023, 20:38 [IST]
Other articles published on Jun 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+