Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: జిడ్డు బ్యాటింగ్‌పై బజ్‌బాల్‌దే గెలుపు.. ఇంగ్లండ్‌కు స్వల్ప ఆధిక్యం!

బర్మింగ్‌హామ్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. బజ్‌బాల్ కాన్సెప్ట్‌తో ఇంగ్లండ్ వన్డే తరహా బ్యాటింగ్ చేస్తుంటే.. అసలు సిసలు టెస్ట్ తరహా‌లో ఆసీస్ ఆచితూచి ఆడుతోంది. మొత్తానికి తొలి ఇన్నింగ్స్‌లో జిడ్డు బ్యాటింగ్‌పై బజ్‌బాల్‌దే పై చేయి అయ్యింది.

311/5 ఓవర్‌నైట్ స్కోర్ మూడో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు కుప్పకూలింది. 75 పరుగుల వ్యవధిలోనే చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా(321 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 141), అలెక్స్ క్యారీ(99 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 66)లను జేమ్స్ అండర్సన్, ఓలీ రాబిన్సన్ ఔట్ చేశారు.

Ashes 2023: England fold Australia for 386, take 7-run lead

ప్యాట్ కమిన్స్(62 బంతుల్లో 3 సిక్స్‌లతో 38) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా ఓలీ రాబిన్సన్ పెవిలియన్ చేర్చాడు. దాంతో ఇంగ్లండ్‌కు 7 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, ఓలీ రాబిన్సన్ మూడేసి వికెట్లు తీయగా.. మొయిన్ అలీ రెండు వికెట్లు పడగొట్టాడు. అండర్సన్, బెన్ స్టోక్స్‌కు ఒక్కో వికెట్ దక్కింది.

మూడో రోజు ఆటను కూడా ఆచితూచి ప్రారంభించిన ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ బౌలర్లు ఇబ్బంది పెట్టారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఒత్తిడి పెంచారు. జేమ్స్ అండర్సన్ సూపర్ ఇన్‌స్వింగర్‌తో అలెక్స్ క్యారీని క్లీన్ బౌల్డ్ చేయగా.. ప్యాట్ కమిన్స్‌తో కలిసి ఉస్మాన్ ఖవాజా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.

ఖవాజాను క్లీన్ బౌల్డ్ చేసిన రాబన్సన్ తన మరుసటి ఓవర్‌లో నాథన్ లయన్(1) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. మరోవైపు ప్యాట్ కమిన్స్ భారీ సిక్సర్లతో ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. స్కాట్ బోలాండ్(0)ను స్టువర్ట్ బ్రాడ్ ఔట్ చేయగా.. కమిన్స్‌ను రాబిన్సన్ ఔట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది.

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 393/8 వద్ద డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే. బజ్ బాల్ కాన్సెప్ట్‌తో బ్యాటింగ్ చేసిన ఆసీస్ 78 ఓవర్లలోనే ఈ పరుగులు చేసి తొలి రోజే డిక్లేర్ ఇచ్చింది. ఇక ఆసీస్ 386 పరుగులు చేయగానికి 116.1 ఓవర్లు ఆడింది.

Story first published: Sunday, June 18, 2023, 18:08 [IST]
Other articles published on Jun 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+