Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: బజ్‌బాల్‌కు వరణుడి దెబ్బ!

బర్మింగ్‌హామ్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో రెండు జట్లు దాదాపుగా సమంగా నిలవడంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రదర్శన విజేతను నిర్ణయించనుంది. అయితే వర్షం కారణంగా మూడో రోజు ఆట చాలా వరకు తుడిచి పెట్టుకుపోయింది.

34.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమవ్వగా.. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 10.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది. క్రీజులో ఓలిపోప్(0 బ్యాటింగ్), జోరూట్(0 బ్యాటింగ్) ఉన్నారు. ఓపెనర్లు జాక్ క్రాలీ(7), బెన్ డక్కెట్(19) దారుణంగా విఫలమయ్యారు. కమిన్స్, బోలాండ్‌కు తలో వికెట్ దక్కింది.

Ashes 2023: England finish 28/2 at stumps on rain-affected Day 3, lead by 35 runs

అంతకుముందు 311/5 ఓవర్‌నైట్ స్కోర్ మూడో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు కుప్పకూలింది. ఆ జట్టు ఓ దశలో 338/5తో విలువైన ఆధిక్యం సంపాదించేలా కనిపించింది. కానీ 48 పరుగుల వ్యవధిలో చివరి అయిదు వికెట్లు కోల్పోయింది.

ఓవర్‌నైట్ బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా(321 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 141), అలెక్స్ క్యారీ(99 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 66)లను జేమ్స్ అండర్సన్, ఓలీ రాబిన్సన్ ఔట్ చేశారు. దాంతో ఇంగ్లండ్‌కు 7 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, ఓలీ రాబిన్సన్ మూడేసి వికెట్లు తీయగా.. మొయిన్ అలీ రెండు వికెట్లు పడగొట్టాడు.

అండర్సన్, బెన్ స్టోక్స్‌కు ఒక్కో వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 393/8 వద్ద డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే. నాలుగో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించకుంటేనే ఈ మ్యాచ్ ఫలితం తేలనుంది. వర్షంతో ఒక్క సెషన్ తుడిచిపెట్టుకుపోయినా.. మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలున్నాయి.

సంక్షిప్త స్కోర్లు:

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 393/8 డిక్లేర్డ్

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 386 ఆలౌట్

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 28/2

Story first published: Monday, June 19, 2023, 11:00 [IST]
Other articles published on Jun 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+