For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ashes 2023: శతక్కొట్టిన జోరూట్.. చేతులెత్తేసిన ఆసీస్!

బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోరూట్(152 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 118 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బజ్‌బాల్ కాన్సెప్ట్‌లో భాగంగా తన శైలికి భిన్నంగా ఆడిన జోరూట్.. ఏడు ఫోర్లు, 4 సిక్స్‌లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా అతను కొట్టిన రివర్స్ స్కూప్ షాట్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి.

జోరూట్ విధ్వంసకర సెంచరీకి జానీ బెయిర్‌స్టో(78 బంతుల్లో 12 ఫోర్లతో 78) హాఫ్ సెంచరీ తోడవ్వడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 78 ఓవర్లలో 393/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఈ ఇద్దరికి అండగా ఓపెనర్ జాక్ క్రాలీ(73 బంతుల్లో 7 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీతో రాణించాడు.

Ashes 2023

ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ నాలుగు వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్ రెండు, స్కాట్ బోలాండ్, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. బజ్ బాల్ కాన్సెప్ట్‌తో ఇంగ్లండ్ 78 ఓవర్లలోనే 393 పరుగులు చేయడం విశేషం.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. ఓ దశలో ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి 176 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో జోరూట్, జానీ బెయిర్ స్టో విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. వన్డే తరహా బ్యాటింగ్‌తో స్కోర్ బోర్డును పరుగెత్తించారు. ఆరో వికెట్‌కు 121 పరుగులు జోడించారు.

బెన్ డకెట్(12), ఓలీపోప్(31), హ్యారీ బ్రూక్(32), బెన్ స్టోక్స్(1) నిరాశపర్చగా.. మొయిన్ అలీ(18), స్టువర్ట్ బ్రాడ్, ఓలీ రాబిన్సన్(17 నాటౌట్)ల సాయంతో జో రూట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెరీర్‌లో జోరూట్‌కు ఇది 30వ టెస్ట్ సెంచరీ.

స్కాట్ బోలాండ్ వేసిన 53వ ఓవర్‌లో జోరూట్ కొట్టిన రివర్స్ స్కూప్ షాట్ మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచింది. ఈ ఓవర్ ఐదో బంతిని బోలాండ్ ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. జోరూట్ రివర్స్ స్కూప్ షాట్ సాయంతో సిక్సర్‌గా మలిచాడు. ప్రస్తుతం ఈ షాట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Story first published: Friday, June 16, 2023, 23:07 [IST]
Other articles published on Jun 16, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+