Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: ఏం గుండెరా అది.. ! (వీడియో)

ఓవల్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. బజ్‌బాల్ కాన్సెప్ట్‌తో ఆసీస్ బౌలర్లను చెడుగుడు ఆడుతున్నారు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. తగ్గేదేలే అన్నట్లు చెలరేగుతున్నారు. దాంతో ఇంగ్లండ్ తొలి సెషన్‌లోనే 3 వికెట్లకు 131 పరుగులు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు బెన్ డక్కెట్(41 బంతుల్లో 3 ఫోర్లతో 41), జాక్ క్రాలీ(37 బంతుల్లో 3 ఫోర్లతో 22) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. హజెల్ వుడ్ వేసిన 6వ ఓవర్‌లో బెన్ డక్కెట్ కొట్టిన బౌండరీ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ ఓవర్‌ తొలి బంతిని హజెల్ వుడ్ 140 కిలో మీటర్ల వేగంతో ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. బెన్ డక్కెట్ స్టెప్ ఔటై స్ట్రైట్‌గా బౌండరీ తరలించాడు.

 Ben Duckett

బెన్ డక్కెట్ షాట్‌కు నాన్‌స్ట్రైకర్‌గా ఉన్న జాక్ ‌క్రాలీ ఉలిక్కిపడ్డాడు. చాకచక్యంగా అతను వంగడంతో బంతి పై నుంచి వెళ్లింది. లేకుంటే అతనికి బంతి బలంగా తాకి తీవ్ర గాయమయ్యేది. జస్ట్ మిస్సవ్వడంతో జాక్ క్రాలీ ఊపిరి పీల్చుకోగా.. అందరూ అవాక్కయ్యారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఈ వీడియోను షేర్ చేస్తూ.. 'హౌ డేర్ యూ బెన్ డక్కెట్'అని క్యాప్షన్ ఇచ్చింది.

ఈ షాట్‌కు ఫిదా అయిన ఫ్యాన్స్ ఏం గుండెరా అది అంటూ కామెంట్ చేస్తున్నారు. రిషభ్ పంత్‌ను కాపీ కొడుతున్నాడని కొందరంటే.. వన్డే ప్రపంచకప్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక భారీ ఇన్నింగ్స్ దిశగా దూసుకెళ్లిన బెన్ డక్కెట్‌ను మిచెల్ మార్ష్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.

ఆ కొద్ది సేపటికే జాక్ క్రాలీని ప్యాట్ కమిన్స్ స్లిప్ క్యాచ్‌‌గా ఔట్ చేయగా.. క్రీజులోకి వచ్చిన జోరూట్(5)ను హజెల్ వుడ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్ ధాటిగా ఆడుతున్నారు. ముఖ్యంగా బ్రూక్ బౌండరీల మోత మోగిస్తున్నాడు. స్టార్క్ వేసిన 25వ ఓవర్‌లో చివరి మూడు బంతులను 4, 4, 6‌గా మలిచిన బ్రూక్.. సింగిల్ తీసి 44 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ధాటిగా ఆడుతున్న మోయిన్ అలీ(34) టాడ్ మర్ఫీ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ 184 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

Story first published: Thursday, July 27, 2023, 19:03 [IST]
Other articles published on Jul 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+