Ashes 2023: విజయానందలో ఉన్న ఆస్ట్రేలియాకు బిగ్ షాక్!
లార్డ్స్: యాషెస్ సిరీస్‌లో వరుస విజయాలతో జోరు కనబరుస్తున్న ఆస్ట్రేలియాకు గట్టి షాక్ తగిలింది. కాలి పిక్క గాయంతో బాధపడుతున్న ఆ జట్టు స్టార్ స్పిన్నర్ నాథన్ లయన్ యాషెస్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ రెండో రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తూ లయన్ గాయపడ్డాడు.
బంతిని అందుకునే క్రమంలో అతని కాలి పిక్క కండరాలు పట్టేసాయి. వెంటనే ఫిజియోల సాయంతో మైదానం వీడిన అతను మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టలేదు. నడవడానికి కూడా ఇబ్బంది పడిన లయన్... రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ కూడా చేయలేదు. కానీ జట్టు విజయం కోసం కుంటుతూనే బ్యాటింగ్‌కు వచ్చాడు. నాలుగు పరుగులు చేసి ఔటయ్యాడు.

తీవ్ర గాయంతో బ్యాటింగ్‌కు వచ్చిన నాథన్ లయన్‌కు ఆసీస్ ఆటగాళ్లంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. బ్యాటింగ్ వెళ్తే రిస్క్ అని తమ మెడికల్ టీమ్ చెప్పిందని, జట్టు విజయం కోసం ఏదైనా చేస్తానని లయన్ తెలిపాడు.
లయన్ గాయం తీవ్రత ఎక్కువ ఉండటంతో యాషెస్ సిరీస్‌లోని చివరి మూడు టెస్ట్‌లు ఆడటం లేదని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కమిన్స్.. లయన్ గాయం గురించి అప్‌డేట్ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
'లయన్ దూరం కావడం జట్టుకు తీరని నష్టం. అతను అసాధారణమై పాత్ర పోషించాడు. అతను లేని మ్యాచ్ తలుచుకుంటేనే వెన్నులో భయం పుడుతోంది.'అని కమిన్స్ తెలిపాడు. లయన్ గైర్హాజరీ ఆసీస్‌ను దెబ్బతీయనుంది. వరుసగా 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన లయన్ తొలిసారి గాయంతో తప్పుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో గెలిచిన ఆసీస్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉంది. 371 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ 327 పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ బెన్‌స్టోక్స్ (155) పోరాడినా ఫలితం లేకపోయింది. బెన్ డుకెట్ (83) మినహా పెద్దగా ఎవరూ రాణించలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హజెల్ వుడ్, కమిన్స్ చెరో మూడు వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్, 2, కామెరూన్ గ్రీన్ ఒక వికెట్ పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications