Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: దెబ్బతీసిన కమిన్స్.. ఆదుకున్న స్టోక్స్!

లీడ్స్‌: యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా మారింది. మ్యాచ్‌పై పట్టు కోసం ఇరు జట్లు హోరా హోరీగా తలపడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తడబడుతోంది. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 116/4తో నిలిచిన ఆసీస్.. ప్రస్తుతం 142 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఇప్పటికైతే కంగారులదే కాస్త పైచేయిగా కనిపిస్తోంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 68/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌.. ప్యాట్ కమిన్స్‌ (6/91) దెబ్బకు 237 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ బెన్ స్టోక్స్‌ (108 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 80) మరోసారి ఒంటరి పోరాటంతో జట్టును ఆదుకోవడంతో పాటు ఇజ్జత్ కాపాడాడు.

patcumminsbenstokes

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌కు మూడో ఓవర్లోనే దెబ్బ పడింది. స్టువర్ట్ బ్రాడ్‌ 17వ సారి డేవిడ్ వార్నర్‌ (1)ను ఔట్ చేశాడు. ఉస్మాన్ ఖవాజా (43), మార్నస్ లబుషేన్‌ (33) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా.. మొయిలీ అలీ దెబ్బతీసాడు. చివరి సెషన్‌లో అలీ (2/34) తన వరుస ఓవర్లలో లబుషేన్‌, స్మిత్‌ (2)లను ఔట్‌ చేసి ఇంగ్లండ్‌కు పుంజుకునే అవకాశాన్నిచ్చాడు.

క్రీజులో పాతుకుపోయిన ఖవాజాను క్రిస్ వోక్స్‌ వెనక్కి పంపడంతో ఆసీస్‌ 90/4తో ఇబ్బందుల్లో పడింది. ఈ పరిస్థితుల్లో ట్రావిస్ హెడ్‌ (18 బ్యాటింగ్‌), మిచెల్‌ మార్ష్‌ (17 బ్యాటింగ్‌) మరో వికెట్‌ పడకుండా ఆట ముగించారు. మిగతా మూడు రోజుల ఆటలో వర్షం పడే సూచనలు ఉన్న నేపథ్యంలో మ్యాచ్‌ మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.

ఇంగ్లండ్‌ను బెన్ స్టోక్స్‌ ఆదుకోకపోతే ఆ జట్టు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. రెండో రోజు రెండో బంతికే జో రూట్‌ (19)ను కమిన్స్‌, కొద్దిసేపటికి బెయిర్‌స్టో (12)ను స్టార్క్‌ (2/59) ఔట్‌ చేయడంతో ఇంగ్లండ్‌ 87/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో మొయిన్‌ అలీ (21)తో కలిసి స్టోక్స్‌ పోరాడాడు.
131/5తో కోలుకుంటున్న ఇంగ్లండ్‌‌ మళ్లీ ఇబ్బందుల్లో పడింది.

engvsaus

అలీని కమిన్స్‌, క్రిస్‌ వోక్స్‌ (10)ను స్టార్క్‌ ఔట్‌ చేయడంతో ఇంగ్లండ్ 142/7తో లంచ్‌ విరామానికి వెళ్లింది. ఈ పరిస్థితుల్లో ఆ జట్టు 180 పరుగులు కూడా చేయడం కష్టమనిపించింది. కానీ రెండో సెషన్‌ మొదలవగానే క్రీజులో అడుగుపెట్టిన మార్క్‌వుడ్‌ (8 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 24) అనూహ్యంగా చెలరేగాడు.

స్టార్క్‌ బౌలింగ్‌లో వరుసగా 6, 4, 6 బౌండరీలు రాబట్టాడు. కమిన్స్‌ బౌలింగ్‌లోనూ ఓ సిక్సర్‌ కొట్టిన వుడ్‌.. వెంటనే నిష్క్రమించాడు. అక్కడి నుంచి స్టోక్స్‌ ధాటిగా ఆడాడు. ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడం కూడా అతనికి కలిసొచ్చింది. ఆసీస్‌కు ఆధిక్యాన్ని ఇవ్వద్దనే ఉద్దేశంతో అతను బౌండరీలతో చెలరేగాడు.

స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీని లక్ష్యంగా చేసుకుని సిక్సర్లతో రెచ్చిపోయాడు. కానీ చివరకు అతని బౌలింగ్‌లోనే స్టోక్స్‌ ఔటవడంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

Story first published: Saturday, July 8, 2023, 8:24 [IST]
Other articles published on Jul 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+