Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: ఆసీస్‌ను ఆదుకున్న స్టీవ్ స్మిత్!

లండన్: యాషెస్ 2023 సిరీస్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ తన జోరు కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో స్మిత్ అసాధారణ బ్యాటింగ్‌తో ఆసీస్‌ను ఆదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా కొనసాగుతున్న జట్టుకు తనకే సాధ్యమైన ఆటతో ఊపిరిపోసాడు.

ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు పరిస్థితులు బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్నా.. ఇంకోవైపు ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగుతున్నా.. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో క్రీజులో అడ్డుగోడగా నిలబడ్డాడు. 123 బంతుల్లో 6 ఫోర్లతో 71 పరుగులు చేసిన స్మిత్.. ఇంగ్లండ్ భారీ ఆధిక్యానికి గండికొట్టాడు. చివరకు క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగిన స్మిత్.. అప్పటికే చేయాల్సిన నష్టం చేసాడు.

 Ashes 2023:

61/1 ఓవర్‌నైట్‌స్కోర్ రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓవర్‌నైట్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను జోరూట్ స్టన్నింగ్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చడంతో ఆసీస్ 115/2 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

రెండో సెషన్ ఆరంభంలోనే ఉస్మాన్ ఖవాజా(47)ను స్టువర్ట్ బ్రాడ్ ఔట్ చేయగా... ఆ కొద్ది సేపటికి ట్రావిస్ హెడ్(4) కూడా అతని బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో స్మిత్, మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. అండర్సన్ దెబ్బకొట్టాడు. ఆ వెంటనే అలెక్స్ క్యారీని జోరూట్ ఔట్ చేయగా.. మిచెల్ స్టార్క్(7)ను మార్క్ వుడ్ పెవిలియన్ చేర్చాడు.

ఈ పరిస్థితుల్లో ప్యాట్ కమిన్స్‌తో కలిసి స్మిత్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న స్మిత్‌ను క్రిస్ వోక్స్ ఔట్ చేయగా..8వ వికెట్‌కు నమోదైన 51 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 95 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 8 వికెట్లకు 273 పరుగులు చేయగా.. క్రీజులో ప్యాట్ కమిన్స్, టాడ్ మర్ఫీ ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ బజ్‌బాల్ బ్యాటింగ్‌తో 54.4 ఓవర్లలోనే 283 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్(91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 85) హాఫ్ సెంచరీతో రాణించాడు. బెన్ డక్కెట్(41), క్రిస్ వోక్స్(36) ధాటిగా ఆడారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ నాలుగు వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్, టాడ్ ముర్ఫీ రెండేసి వికెట్లు తీసారు. ప్యాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Friday, July 28, 2023, 22:46 [IST]
Other articles published on Jul 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+