Ashes 2021: జోస్ బట్లర్ స్టన్నింగ్ క్యాచ్.. అచ్చం పక్షిలానే డైవ్! బిత్తరపోయిన ఆసీస్ ఓపెనర్ ( వీడియో)

అడిలైడ్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2021లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఫస్ట్ స్లిప్ ఫీల్డర్ అందుకోవాల్సిన క్యాచ్‌ను బట్లర్.. సూపర్ డైవ్‌తో సింగిల్ హ్యాండ్‌తో పట్టేసాడు. అచ్చం పక్షిలానే డైవ్ చేశాడు. అతని సూపర్ క్యాచ్‌కు ఆస్ట్రేలియా ఓపెనర్ మార్కస్ హ్యారీస్(3) బిత్తరపోయాడు. బట్లర్ వైపు తదేకంగా చూస్తూ నిరాశగా పెవిలియన్ చేరాడు.
బట్లర్ అందుకున్న ఈ క్యాచ్‌ను చూసి సహచర ఆటగాళ్లతో పాటు మైదానంలోని ప్రేక్షకులు కూడా సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. సూపర్ క్యాచ్ అంటూ చప్పట్లతో అభినందించారు. కామెంటేటర్లు సైతం బట్లర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆఖరి క్షణం వరకు బట్లర్ కంటి చూపు.. బంతిపైనే ఉందని, అందుకే సరిగ్గా అంచనా వేసి సూపర్ డైవ్‌తో అందుకున్నాడని వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులు సైతం ఈ క్యాచ్‌కు ఫిదా అవుతున్నారు.
షార్ట్ పిచ్ బాల్‌తో...
స్టువర్ట్ బ్రాడ్ వేసిన 8వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని బ్రాడ్ షార్ట్ పిచ్‌బాల్‌గా వేయగా.. హ్యారిస్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ మిస్‌టైమ్ అయిన బంతి కీపర్ కుడివైపు దూసుకెళ్లింది. ఈ బంతిని సరిగ్గా అంచనా వేసిన బట్లర్ సూపర్ డైవ్‌తో ఒడిసిపట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక హ్యారీస్ రూపంలో ఆరంభంలోనే ఆ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ డేవిడ్ వార్నర్(5 బ్యాటింగ్)తో పాటు మార్నస్ లబుషేన్(10 బ్యాటింగ్) ఉన్నారు. 21 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టానికి 20 రన్స్ చేసింది.

కమిన్స్ ఔట్..
ఇక మ్యాచ్‌కు ముందే ఆసీస్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అనూహ్య పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దాంతో మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. యువ ప్లేయర్ మైఖేల్ నెసర్ ఈ మ్యాచ్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ టెస్టు మ్యాచ్‌కు ముందు డిన్నర్ కోసం రెస్టారెంట్‌కు వెళ్లిన కమిన్స్ అక్కడ కోవిడ్ పాజిటివ్ వ్యక్తికి సన్నిహితంగా మెలిగినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ముందస్తు చర్యల్లో భాగంగా అతన్ని జట్టు నుంచి తప్పించారు. ఆస్ట్రేలియా కోవిడ్ నిబంధనల ప్రకారం కమిన్స్ మరో 7 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి. బిస్బేన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన ఆసీస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

తుది జట్లు
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మార్కస్ హారిస్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), మైఖేల్ నెసర్, మిచెల్ స్టార్క్, జై రిచర్డ్‌సన్, నాథన్ లయన్.
ఇంగ్లండ్: రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలన్, జో రూట్(కెప్టెన్), బెన్ స్టోక్స్, ఓలీ పోప్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, ఓలీ రాబిన్సన్, స్టువర్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications