Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2021: క్యా సీన్‌ హై! ఓవైపు మ్యాచ్.. మరోవైపు లవ్ ప్రపోజల్! లిప్‌ లాక్‌లతో ముంచెత్తి..(వీడియో)

Ashes 2021: England fan proposes his Australian girlfriend in front of the crowd

బ్రిస్బేన్: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య గబ్బా వేదికగా జరుగుతోన్న ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తొలి టెస్ట్ మూడో రోజు తొలి సెషన్ ఆట సందర్భంగా ఇంగ్లండ్‌కు చెందిన ఓ అభిమాని.. ఆస్ట్రేలియాకు చెందిన తన ప్రేయసికి ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా అతని ప్రేమకు అంగీకారం తెలపడంతో మనోడు సంతోషంతో ఎగిరి గంతేసాడు. ఆమెను అమాంతం ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే.. మూడో రోజు ఆటలో భాగంగా... ఫ్యాన్స్‌ అంతా మ్యాచ్‌ వీక్షిస్తుండగా.. ఇంగ్లండ్‌కు చెందిన రాబ్‌ అనే వ్యక్తి మాత్రం తన పనిలో తాను తలమునకలైపోయాడు. ఆస్ట్రేలియాకు చెందిన ప్రేయసి నాట్‌ ముందు మోకాళ్లపై కూర్చుని ఉంగరం తీసి ఆమెకు ప్రపోజ్‌ చేశాడు. 'గత నాలుగేళ్లుగా నీ కోసం ఎదురు చూస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని అడిగాడు. ఊహించని ఈ పరిణామానికి మొదట కొంత అయోమయానికి గురైన నాట్.. తర్వాత అతడి ప్రపోజల్‌కు ఒప్పుకొంది. రాబ్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని ముద్దుల్లో ముంచెత్తింది .

ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఎంత వైరం ఉన్నా.. వాటికి అతీతంగా ఒక్కటైన ఈ జంటను స్టాండ్స్‌లో ఉన్న అభిమానులు చప్పట్లు, కేరింతలతో ఉత్సాహపరిచారు. 2017-18లో మెల్‌బోర్న్‌ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన యాషెస్‌ సిరీస్ సందర్భంగా.. రాబ్, నాట్‌ల మధ్య ప్రేమాయణం మొదలైందట.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ మలాన్(80 బ్యాటింగ్), కెప్టెన్ జోరూట్( 86 బ్యాటింగ్) ఉన్నారు. ఓపెనర్లు రోరీ బర్న్స్(13), హసీబ్ హమీద్(27) మరోసారి విఫలమైనా.. జోరూట్, మలాన్ ఆదుకున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్‌, కమిన్స్ చెరొక వికెట్ తీశారు. ఇక అంతకుముందు 343/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 425 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్(152) రాణించగా.. మిచెల్ స్టార్క్(35) ఫర్వాలేదనిపించాడు. చివరి మూడు వికెట్లలో వోక్స్ రెండు తీయగా.. వుడ్ ఒకటి పడగొట్టాడు. ఇక ఆసీస్‌కు 278 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 147 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ఇంకా 58 పరుగుల వెనుకంజలో ఉంది. ఈ మ్యాచ్‌ను కాపాడుకోవాలంటే ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 600 ప్లస్ రన్స్ చేయాల్సిందే.

Story first published: Friday, December 10, 2021, 16:27 [IST]
Other articles published on Dec 10, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+