
బట్లర్ స్టన్నింగ్ క్యాచ్..
ఇక ఈ డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆఖరి క్షణంలో అనూహ్యంగా తప్పుకున్నాడు. కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తితో కమిన్స్ సన్నిహితంగా మెదిలాడని అతన్ని జట్టు నుంచి తప్పించారు. దాంతో స్టీవ్ స్మిత్ మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. ఇక ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌కు ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ శుభారంభాన్ని అందించాడు. వికెట్ కీపర్ జోస్ బట్లర్ స్టన్నింగ్ క్యాచ్ సాయంతో ఓపెనర్ మార్కస్ హ్యారీస్‌ను పెవలియన్ చేర్చాడు. దాంతో 4 పరుగులకే ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన లబుషేన్‌తో డేవిడ్ వార్నర్ ఆచితూచి ఆడాడు.

జిడ్డు బ్యాటింగ్‌తో..
ఈ ఇద్దరూ జిడ్డు బ్యాటింగ్‌తో అసలు సిసలు టెస్ట్ క్రికెట్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లను గౌరవిస్తూ వీలు చిక్కిన బంతని బౌండరీలకు తరలించారు. వార్నర్ సైతం తన శైలికి భిన్నంగా పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేశాడు. దాంతో ఆస్ట్రేలియా 45/1తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. 25 ఓవర్ల పాటు సాగిన ఫస్ట్ సెషన్‌లో 45 పరుగులే చేసారంటే.. ఈ ఇద్దరూ ఎంత జిడ్డుగా బ్యాటింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాతో కూడా అదే మాదిరి బ్యాటింగ్ చేసిన ఈ జోడీ.. స్కోర్ బోర్డును పరుగెత్తించే ప్రయత్నం చేసింది.

పాపం డేవిడ్ వార్నర్
ఈ క్రమంలోనే ముందుగా డేవిడ్ వార్నర్ 108 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఆ తర్వాత లబుషేన్ సైతం 156 బంతుల్లో 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. హాఫ్ సెంచరీలు అనంతరం కొంచెం జోరు పెంచడంతో ఆస్ట్రేలియా 129/1 స్కోర్‌తో సెకండ్ సెషన్ ముగించింది. టీ బ్రేక్ అనంతరం ధాటిగా ఆడిన వార్నర్.. మళ్లీ సెంచరీ ముంగిట వికెట్ సమర్పించుకున్నాడు. స్టోక్స్ బౌలింగ్‌లో బ్రాడ్‌కు క్యాచ్ వెనుదిరిగాడు. ఇక ఫస్ట్ టెస్ట్‌లో కూడా వార్నర్ ఇలానే 94 పరుగులకు ఔటై సెంచరీ చేజార్చుకున్న విషయం తెలిసిందే. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 172 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

బట్లర్ చేజేతులా..
క్రీజులోకి స్టీవ్ స్మిత్ రాగా.. లబుషేన్ ఎలాంటి తడబాటు లేకుండా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. రాయిలా నిల్చొని ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. ఇక ఇన్నింగ్స్ ప్రారంభంలో స్టన్నింగ్ క్యాచ్‌తో ఔరా అనిపించిన బట్లర్.. చివర్లో మాత్రం లబుషేన్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను నేలపాలు చేశాడు. అంతకుముందు స్టోక్స్ కూడా చేజార్చాడు. ఈ రెండు లైఫ్స్‌తో బతికి పోయిన లబుషేన్.. వికెట్ పడకుండా తొలి రోజు ఆటను ముగించాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.


Click it and Unblock the Notifications












