Ashes 2021: గర్జించిన ‘లయన్’.. ఆస్ట్రేలియా శుభారంభం.. చిత్తుగా ఓడిన ఇంగ్లండ్!

బ్రిస్బేన్: ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. గబ్బా వేదికగా జరిగిన తొలి టెస్టులో సమష్టిగా రాణించిన ఆతిథ్య ఆసీస్.. 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. నాలుగు రోజుల్లోనే ఈ మ్యాచ్‌ను ముగించిన కమిన్స్ సేన.. ఈ గెలుపుతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. 220/2 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్ మరో 77 పరుగులకే మిగతా వికెట్లు కోల్పోయింది.
దీంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ సాధించిన 19 పరుగుల ఆధిక్యాన్ని ఆసీస్ 5.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ధనాధన్ బ్యాటింగ్‌తో విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్ (148 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 152) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

కమిన్స్ దెబ్బకు..
అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్(5/38) ఐదు వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్ 147 పరుగులకే కుప్పకూలింది. జోస్ బట్లర్ (39), ఓలి పోప్ (35), హసీబ్ హమీద్ (25), క్రిస్ వోక్స్ (21) పరుగులు చేయడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరునైనా చేయగలిగింది. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కమిన్స్‌కు తోడుగా హజెల్ వుడ్, మిచెల్ స్టార్క్ రెండేసి వికెట్లు తీయగా.. కామెరూన్ గ్రీన్ ఓ వికెట్ పడగొట్టాడు.

పటిష్ట స్థితిలో నిలిచినా..
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 425 పరుగుల భారీ స్కోర్ చేసింది. ట్రావిస్ హెడ్ ధనాధన్ సెంచరీకి.. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (176 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 94), లబూషేన్(117 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 74) రాణించారు. దాంతో ఆసీస్‌కు 297 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్, రాబిన్సన్ తలో మూడు, క్రిస్ వోక్స్ రెండు, జాక్‌లీచ్, రూట్ తలో వికెట్ తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సరికి 220/2 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది.

గర్జించిన లయన్..
అయితే, నాలుగో రోజు నాథన్ లయన్(4/91) నాలుగు వికెట్లతో విజృంభించడంతో ఇంగ్లండ్ మరోసారి స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. మరో 77 పరుగులు జోడించి 297 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోరూట్(165 బంతుల్లో 10 ఫోర్లతో 89), డేవిడ్ మలాన్(195 బంతుల్లో 10 ఫోర్లతో 82) మినహా అంతా విఫలమయ్యారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు ఏకంగా 172 పరుగులు జోడించారు. ముందుగా మలన్‌ను లయన్ క్యాచ్ ఔట్ చేయగా.. జోరూట్‌కు కామెరూన్ గ్రీన్ కళ్లెం వేసాడు. కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. 6 పరుగుల వ్యవధిలోనే ఈ ఇద్దరు ఔటవ్వగా.. అనంతరం ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications