న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ashes 2021:చెలరేగిన రిచర్డ్‌సన్.. ఇంగ్లండ్ ఘోర పరాజయం! ఆసీస్ లీడ్ డబుల్!

Australia Beat England By 275 Runs To Take 2-0 Lead

అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లోనూ సమష్టిగా విఫలమైన ఇంగ్లండ్ 275 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. 82/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 192 పరుగులకు కుప్పకూలింది. క్రిస్ వోక్స్(44), రోరీ బర్న్స్(34) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా పేసర్ జై రిచర్డ్‌సన్(5/42) ఐదు వికెట్లతో ఇంగ్లండ్ పతనన్నాశాసించాడు.

అతనికి తోడుగా మిచెల్ స్కార్క్(2/43), నాథన్ లయన్(2/55) రెండేసి వికెట్లు తీయగా.. మైకేల్ నేసర్ ఓ వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించిన మార్నస్ లబుషేన్‌కు మ్యాన్ ఆఫ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల ఈ సిరీస్‌లో ఆసీస్ 2-0తో తమ ఆధిక్యాన్ని పెంచుకుంది.

చివరి రోజు ఆట ప్రారంభంలోనే ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ ఓలీ పోప్(4) స్కార్క్ బౌలింగ్ క్యాచ్ ఔటయ్యాడు. ఆ కొద్దిసేపటికే ఆదుకుంటాడుకున్న బెన్ స్టోక్స్(12) సైతం లయన్ స్పిన్ ఉచ్చులో చిక్కుకుపోయాడు. ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఈ పరిస్థితుల్లో జోస్ బట్లర్(26), క్రిస్ వోక్స్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేశారు. ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. ఏడో వికెట్‌కు 65 పరుగులు జోడించిన అనంతరం ఈ జోడిని రిచర్డ్‌సన్ విడదీశాడు. హాఫ్ సెంచరీకి చేరువైన వోక్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. మరో 36 పరుగుల వ్యవధిలోనే మిగతా మూడు వికెట్లు కోల్పోయి భారీ ఓటమిని మూటగట్టుకుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను 473/9 స్కోర్ వద్ద డిక్లేర్ ఇచ్చింది. మార్నస్ లబుషేన్(103) సెంచరీతో రాణించగా.. కెప్టెన్ స్మిత్(93), ఓపెనర్ డేవిడ్ వార్నర్ తృటిలో టన్ మార్క్ అందుకోలేకపోయారు. అలెక్స్ క్యారీ(51) హాఫ్ సెంచరీతో మెరిసాడు. ఇక ఇంగ్లండ్ తమ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 236 పరుగులకే ఆలౌటైంది. డేవిడ్ మలాన్(80), జోరూట్(62) మినహా అంతా విఫలమయ్యారు.ఇక 237 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. 230/9 పరుగుల వద్ద డిక్లేర్ ఇచ్చింది. మార్నస్ లబుషే(51), ట్రావిస్ హెడ్(51) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక 468 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 192 పరుగులకే కుప్పకూలి చిత్తుగా ఓడింది.

Story first published: Monday, December 20, 2021, 15:55 [IST]
Other articles published on Dec 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X