Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2021-22: ట్రావిస్ హెడ్ టీ20 స్టైల్ బ్యాటింగ్.. వార్నర్ సెంచరీ మిస్! ఇంగ్లండ్‌పై పట్టు బిగించిన ఆసీస్!

 Ashes 2021-22: Travis Heads Ton Puts Australia In Control vs England

బ్రిస్బేన్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో గబ్బా వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా పట్టు సాధిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 84 ఓవర్లలో 7 వికెట్లకు 343 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ట్రావిస్ హెడ్(95 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 112 బ్యాటింగ్)ధనాధన్ బ్యాటింగ్‌తో సెంచరీ బాదగా.. విధ్వసంకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ (176 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 94) టీ20 ప్రపంచకప్ ఫామ్‌ను కొనసాగించాడు.

అయితే తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. నిలకడకు మారుపేరుగా నిలిచే మార్నస్ లబుషేన్(117 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 74) సైతం హాఫ్ సెంచరీతో రాణించాడు. ప్రస్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్ (112 బ్యాటింగ్), మిచెల్ స్టార్క్ (10 బ్యాటింగ్) ఉన్నారు. ఇప్పటికైతే ఆస్ట్రేలియా 196 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్ మూడు వికెట్లతో సత్తా చాటారు.

ఆదిలోనే గట్టిషాక్..

ఆదిలోనే గట్టిషాక్..

రెండో రోజే తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. ఓపెనర్ మార్కస్ హ్యారీస్(3)ను ఓలీ రాబిన్సన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అనంతరం లబుషేన్ క్రీజులోకి రాగా మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్‌కు ఇంగ్లండ్ ఆటగాళ్లు మూడు లైఫ్‌‌లు ఇచ్చారు. ముందుగా.. ఆసీస్ ఇన్నింగ్స్ 12 వ ఓవర్లో వార్నర్ 17 పరుగుల వద్ద ఉండగా బెన్ స్టోక్స్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

కానీ అది నోబాల్ కావడంతో వార్నర్ ఊపిరిపీల్చుకున్నాడు. ఇక ఆ తర్వాత ఇన్నింగ్స్ 32వ ఓవర్లో వార్నర్ భాయ్ 49 పరుగుల వద్ద ఉండగా.. అతడు ఇచ్చిన క్యాచ్ ను స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్ నేలపాలు చేశాడు. అలా వార్నర్ కు రెండోసారి అదృష్టం వరించింది.

ముచ్చటగా మూడు లైఫ్స్..

ముచ్చటగా మూడు లైఫ్స్..

ఇక వార్నర్ 60 పరుగుల వద్ద ఉండగా ముచ్చటగా మూడోసారి కూడా అతడిని అదృష్టం వరించింది. మార్క్ వుడ్ బౌలింగ్ లో షాట్ ఆడిన వార్నర్ సింగిల్ కు ప్రయత్నించాడు. కానీ షార్ట్ లెగ్ లో ఉన్న హసీబ్ హమీద్.. బంతిని అందుకున్నాడు. దీంతో అలర్ట్ అయిన వార్నర్.. వెనక్కి తిరిగే క్రమంలో జారిపడ్డాడు.

ఈ సందర్భంలో బ్యాట్ కూడా జారిపోయింది. మరోవైపు బంతిని వేగంగా అందుకున్న హమీద్.. వికెట్లకు గురి చూసి కొట్టాడు. బంతి వికెట్లకు తగలడం ఖాయం అనుకున్నారంతా.. కానీ ఈసారి కూడా అదృష్టం వార్నర్ వైపే ఉంది. హమీద్ విసిరిన ఆ బంతి వికెట్ల పక్కనుంచి వెళ్లింది. ఒకవేళ ఆ బంతి వికెట్లను తాకితే వార్నర్ పని అయిపోయేదే.

సెంచరీ మిస్..

సెంచరీ మిస్..

మూడు ఛాన్సులొచ్చినా డేవిడ్ వార్నర్ సెంచరీ చేయలేకపోయాడు. ఇన్నింగ్స్ 55.2 ఓవర్లో.. వార్నర్ 94 పరుగుల వద్ద ఉండగా రాబిన్సన్ వేసిన బంతిని స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక వార్నర్ కన్నా ముందే లబుషేన్ జాక్ లీచ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 156 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్(12) తీవ్రంగా నిరాశపరిచాడు. మార్క్ వుడ్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే వార్నర్‌, కామెరూన్ గ్రీన్(0) కూడా వెనుదిరిగారు. దాంతో పటిష్టస్థితిలో నిలిచిన ఆసీస్ ఒక్కసారిగా డీలా పడిపోయింది. 195 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.

 సూపర్ సెంచరీతో..

సూపర్ సెంచరీతో..

ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ట్రావిస్ హెద్ తనదైన శైలిలో చెలరేగాడు. టీ20 తరహా బ్యాటింగ్‌తో రెచ్చిపోయాడు. క్రీజులోకి వచ్చిన అలెక్స్ క్యారీ(12), ప్యాట్ కమిన్స్(12), మిచెల్ స్కార్క్(10 బ్యాటింగ్) సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకుంటూ ఇంగ్లండ్ బౌలర్లను చితక్కొట్టాడు. ఇక తొలి రోజు ఇంగ్లండ్‌ను 147 పరుగులకే కట్టడి చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐదు వికెట్లతో చెలరేగిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, December 9, 2021, 19:06 [IST]
Other articles published on Dec 9, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+