ఆర్చర్ బంతి తగలగానే ఫిలిప్ హ్యూస్ విషాదం గుర్తుకు వచ్చింది: స్టీవ్ స్మిత్

లీడ్స్: ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ 148 కి.మీ వేగంతో విసిరిన బౌన్సర్ తగలగానే ఫిలిప్ హ్యూస్ విషాదం గుర్తుకు వచ్చిందని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపారు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలతో ఆసీస్ జట్టును గెలిపించిన స్టీవ్ స్మిత్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. అయితే జోఫ్రా ఆర్చర్ దెబ్బ అతడిని రెండో ఇన్నింగ్స్‌కు దూరం చేసింది. మరుసటి రోజు తలనొప్పి ఉండటంతో మైదానంలోకి దిగలేదు. దీంతో ఆసీస్ కాంకషన్ సబ్ స్టిట్యూట్‌గా మార్నస్ లబషేన్‌ను ఆడించింది. గాయం నుంచి కోలుకోకపోవడంతో మూడో టెస్టు నుంచి స్మిత్ తప్పుకోవాల్సి వచ్చింది.

హ్యూస్ విషాదం గుర్తుకు వచ్చింది:
తాజాగా స్మిత్ మాట్లాడుతూ... 'బంతి తగలగానే నా మెదుడులో కొన్ని విషయాలు పరుగెత్తాయి. ముఖ్యంగా నాకు ఎక్కడ గాయం అయింది అని కంగారుపడ్డా. ఆ సమయంలో ఫిలిప్ హ్యూస్ విషాదం గుర్తుకు వచ్చింది. అప్పుడు ఏం జరిగిందో అందరికి తెలుసు. దీంతో కొంత ఆందోళనకు గురయ్యా. కొద్ది సమయం తర్వాత నేను బాగానే ఉన్నాను. ఇక మధ్యాహ్నం అంతా మానసికంగా కూడా బాగానే ఉన్నాను' అని స్మిత్ తెలిపాడు.

6 బీర్లు తాగిన ఫీలింగ్:
'మొదటి ఇన్నింగ్స్‌లో రెండోసారి బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఎలాంటి అసౌకర్యం కలగలేదు. అయితే సాయంత్రం డాక్టర్ వచ్చి ఎలా ఉంది అని అడిగినపుడు మాత్రం గత రాత్రి 6 బీర్లు తాగిన ఫీలింగ్ ఉంది అని చెప్పా. అపుడు నాకు అలాగే అనిపించింది. మరో రెండు రోజులు కూడా అలాగే ఉంది. కొన్ని ఘటనలు ఆలా జరుగుతాయి. ఏదేమైనా మంచి టెస్ట్ మ్యాచ్ మిస్ అయ్యా' అని స్మిత్ పేర్కొన్నాడు.

7 సార్లు 50 పరుగులకు పైగా పరుగులు:
రెండో టెస్టులో ఆర్చర్ వేసిన బంతి స్మిత్ తలకు బలంగా తగిలింది. వెంటనే వైద్య బృందాలు అతడికి చికిత్సను అందించాయి. ఇక ఆసీస్ వైద్యుల సూచన మేరకు స్మిత్.. రిటైర్డ్ హార్డ్‌గా వెనుదిరిగాడు. అప్పటికి స్మిత్ 80 పరుగులతో ఉన్నాడు. సిడిల్ పెవిలియన్ చేరిన తరువాత తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్.. మరో 12 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో యాషెస్‌లో వరుసగా ఏడుసార్లు 50 పరుగులకు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగా స్మిత్ రికార్డు సృష్టించాడు.
ఇండియా vs వెస్టిండీస్: రెండో టెస్టుకు జట్టు ఇదే.. అశ్విన్‌కు చోటెక్కడిది?

యాషెస్‌తో పునరాగమనం:
బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు నిషేధానికి గురైన స్మిత్.. యాషెస్‌తో టెస్టు క్రికెట్‌లో పునరాగమనం చేశాడు. తొలి టెస్టులో 144, 142 పరుగులతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. రెండో టెస్టులోని తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యాషెస్‌లో ఇరు జట్లు సిరీస్‌ను 1-1తో సమం చేశాయి. తొలి టెస్టులో ఆసీస్ ఘన విజయం సాధించగా, రెండో టెస్టు డ్రాగా ముగిసింది. మూడో టెస్ట్ ఇంగ్లండ్ గెలిచింది. నాలుగో టెస్టులో గెలిచి సిరీస్‌పై పట్టు బిగించాలని ఇరు జట్లు ఆరాటపడుతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications