For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్‌ సిరీస్‌లో పరుగుల వరద.. గవాస్కర్‌ సరసన స్టీవ్ స్మిత్‌!!

Ashes 2019: Steve Smith equals Sunil Gavaskars 774 runs in 4 Tests of a series

లండన్‌: బాల్ టాంపరింగ్ వివాదంలో ఇరుక్కుని ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ పురాగమనం గొప్పగా చాటాడు. తొలి టెస్టులో రెండు శతకాలు.. రెండో టెస్టులో అర్ధ సెంచరీ చేసిన స్మిత్‌.. నాలుగో టెస్టులో ఏకంగా డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. ఇక ఐదవ టెస్టులో కూడా అర్ధ సెంచరీ చేసాడు. యాషెస్‌ సిరీస్‌లో పరుగుల వరద పారించిన స్మిత్‌ భారత దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ సరసన నిలిచిచాడు.

గావస్కర్‌ సరసన స్మిత్‌:

గావస్కర్‌ సరసన స్మిత్‌:

స్టీవ్ స్మిత్ యాషెస్‌ సిరీస్‌ 2019లో మొత్తంగా సుమారు 110 సగటుతో 774 పరుగులు చేసాడు. ఒక ఆటగాడు కనీసం నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడిన సిరీస్‌ పరంగా చూస్తే.. విండీస్‌ దిగ్గజ ఆటగాడు వివ్‌ రిచర్డ్స్‌ (829) తర్వాత స్థానాన్ని స్మిత్ ఆక్రమించాడు. ఇక గావస్కర్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. 1971 తన అరంగేట్ర టెస్టు సిరీస్‌లో గావస్కర్‌ 774 పరుగులు చేసాడు. ఈ జాబితాలో రెండు, నాలుగు స్థానాల్లో స్మిత్‌ ఉండటం విశేషం. 2014-15 సీజన్‌లో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో స్మిత్‌ 769 పరుగులు సాధించాడు.

మూడో డబుల్‌ సెంచరీ:

మూడో డబుల్‌ సెంచరీ:

ఈ యాషెస్‌ సిరీస్‌ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ అయినప్పటికీ.. స్మిత్‌ నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. రెండో టెస్టులో ఇంగ్లీష్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన రాకాసి బంతికి గాయపడ్డ స్మిత్ మూడో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే రెండో టెస్టులో గాయపడ్డా తిరిగి బ్యాటింగ్ కొనసాగించడం విశేషం. స్మిత్‌ యాషెస్‌ సిరీస్‌లో మూడో డబుల్‌ సెంచరీ చేసాడు. యాషెస్‌ సిరీస్‌లో డాన్‌ బ్రాడ్‌మన్‌ (8), వాలీ హమ్మాండ్‌ (4)లు మాత్రమే స్మిత్‌ కంటే ముందున్నారు.

 గ్యారీ సోబర్స్‌ను వెనక్కినెట్టి:

గ్యారీ సోబర్స్‌ను వెనక్కినెట్టి:

నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌పై సాధించిన సెంచరీ స్మిత్‌కు 11వది. దీంతో ఇంగ్లండ్‌ జట్టుపై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. వెస్టిండీస్ లెజెండ్ గ్యారీ సోబర్స్‌ (10)ను అధిగమించి ఇంగ్లండ్‌పై అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మన్ జాబితాలో రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ జాబితాలో సర్ డాన్ బ్రాడ్‌మాన్ (19) అగ్రస్థానంలో ఉన్నాడు.

యాషెస్‌ సిరీస్‌ 2019.. 113 ఏళ్ల చెత్త రికార్డు బద్దలు!!

ఏకైక బ్యాట్స్‌మన్‌ స్మిత్‌:

ఏకైక బ్యాట్స్‌మన్‌ స్మిత్‌:

మరొకవైపు ఒక ప్రత్యర్థి జట్టుపై అత్యధిక టెస్టు సెంచరీలు జాబితాలో స్మిత్‌ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో డాన్‌ బ్రాడ్‌మన్‌ (19 సెంచరీలు, ఇంగ్లండ్‌పై), సునీల్‌ గావస్కర్‌ (13 సెంచరీలు, వెస్టిండీస్‌పై), జాకబ్‌ హాబ్స్‌ (12 సెంచరీలు, ఆసీస్‌పై)లు స్మిత్‌ కంటే ముందు ఉన్నారు. గత 25 ఏళ్లలో ఇంగ్లండ్‌ గడ్డపై డబుల్‌ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌ స్మిత్‌ మాత్రమే.

Story first published: Monday, September 16, 2019, 15:13 [IST]
Other articles published on Sep 16, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+