22 ఏళ్ల తర్వాత లార్డ్స్‌లో యాషెస్ టెస్టు మ్యాచ్ డ్రా

హైదరాబాద్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్‌లో లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా చివరి రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి 47.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.
కాంకషన్ సబ్‌స్టిట్యూట్ ఆటగాడు మార్నస్ లాబస్‌చేంజ్ 100 బంతుల్లో 8 ఫోర్లు సాయంతో 59 పరుగులతో అద్భుత ప్రదర్శన చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ మెడను బలంగా తాకడంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అనతంరం 40 నిమిషాల తర్వాత తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్ 92 పరుగుల వద్ద ఔటయ్యాడు.

రెండో టెస్టు నుంచి తప్పుకున్న స్మిత్
అయితే గాయం తీవ్రత దృష్ట్యా స్టీవ్ స్మిత్ రెండో టెస్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో ఐసీసీ కొత్తగా ప్రవేశపెట్టిన కాంకషన్ సబ్‌స్టిట్యూట్ నిబంధనలో భాగంగా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్ స్థానంలో మార్నస్ లాబస్‌చేంజ్ బరిలోకి దిగాడు. అయితే, ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతగా ఎదుర్కొన్న లాబస్‌చేంజ్ మ్యాచ్ డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
1997 తర్వాత డ్రా కావడం ఇదే మొదటిసారి
1997 తర్వాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఓ యాషెస్ టెస్టు మ్యాచ్ డ్రా కావడం ఇదే మొదటిసారి. దీంతో 22 ఏళ్ల తర్వాత యాషెస్ సిరిస్‌లో లార్డ్స్ టెస్టు డ్రాగా ముగిసిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 2018లో న్యూజిలాండ్‌తో క్రిస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఇంగ్లాండ్ టెస్టును డ్రాగా ముగించింది.

జాబితాలో శ్రీలంక అగ్రస్థానం
కాగా, టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక దేశంలో జరిగిన టెస్టు మ్యాచ్‌ల పరంగా చూస్తే అత్యధిక ఫలితాలు వచ్చిన జాబితాలో శ్రీలంక అగ్రస్థానంలో ఉంది. 2014-19 మధ్య కాలంలో శ్రీలంకలో జరిగిన టెస్టుల్లో 25 వరుస ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత ఇంగ్లాండ్ ఇంగ్లాండ్‌లోనే అత్యధిక వరుస టెస్టు ఫలితాలు వచ్చాయి.
యాషెస్ రెండో టెస్టు: ఉత్కంఠ రేపినా.. చివరకు డ్రానే!!

లీడ్స్‌లో మూడో టెస్టు
ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్ విజయం సాధించడంతో ఇంగ్లీషు గడ్డపై వరుస విజయాల సంఖ్య 20కు చేరింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఐదు టెస్టు మ్యాచ్‌ల యాషెస్ సిరిస్‌లో మూడో టెస్టు లీడ్స్‌లో శుక్రవారం ఆరంభమవుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications