యాషెస్ ఆఖరి టెస్ట్: 18 ఏళ్ల తర్వాత సిరీస్ నెగ్గాలని ఆసీస్.. ఒత్తిడిలో ఇంగ్లండ్

లండన్: గురువారం నుంచి ఆరంభమయ్యే చివరిదైన ఐదో టెస్టుతో యాషెస్ సిరీస్ చివరి అంకానికి చేరింది. 18 ఏండ్ల నుంచి ఇంగ్లండ్ గడ్డపై యాషెస్ నెగ్గాలని తహతహలాడుతున్న కంగారూల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇప్పటికే 2-1తో ట్రోఫీ నెగ్గిన ఆసీస్.. ఓవల్‌లో జరిగే ఆఖరి టెస్ట్‌నూ కైవసం చేసుకొని గర్వంగా తిరుగు ప్రయాణం కావాలని చూస్తోంది. ఇక చివరి టెస్టులోనైనా నెగ్గి ట్రోఫీ దక్కకపోయినా.. 2-2తో సిరీస్ సమం చేయాలని ఇంగ్లండ్ కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం కొరకరాని కొయ్యలా మారిన స్మిత్‌ను కట్టడి చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారించింది.

వార్నర్ ఫామ్ ఆందోళన:
ఆసీస్ విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ సిరీస్‌లో విఫలమయ్యాడు. వరల్డ్‌కప్‌లో రాణించిన వార్నర్.. ఈ టూర్‌లో కనీసం ఒక్క ఇన్నింగ్స్‌లో కూడా తన ప్రభావం చూపలేకపోయాడు. ఆడిన ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఏడుసార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఇక ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌ను ఎదుర్కునేందుకే నానా తంటాలు పడుతున్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో ఆరు సార్లు అతడి బౌలింగ్‌లోనే ఔటైన వార్నర్ చివరి టెస్టులోనైనా రాణించాలని ఆసీస్ కోరుకుంటోంది. ఇక మరో ఓపెనర్ హారిస్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. వీరిద్దరూ విఫలమవుతుండటంతో ఆసీస్ కోలుకోలేకపోతోంది.

స్మిత్ హవా:
ఓపెనర్లు విఫలమయినా.. స్మిత్ జట్టును ఆడుకుంటున్నాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో స్మిత్ 671 పరుగులు చేయాడు. ఇదే ఊపులో అతడు టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి సైతం ఎగబాకాడు. సిరీస్‌లో రెండు జట్ల మధ్య ప్రధాన తేడా స్మిత్ మాత్రమే. ఈ సిరీస్‌లో అతడి అత్యల్ప స్కోరు 82 అంటేనే అతడు ఎంత భీకర ఫామ్‌లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. రెండో టెస్టులో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి అదరగొట్టిన లబుషేన్ మంచి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటున్నడు. అయితే మిడిలార్డర్‌లో వెడ్, హెడ్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. కెప్టెన్ పైన్ ఫర్వాలేదనిపిస్తున్నాడు. ఇక బౌలింగ్‌లో స్టార్క్, కమిన్స్, హజిల్‌వుడ్ ఫామ్ ఆసీస్‌కు కలిసొచ్చే అంశం.

రూట్ ఫామ్ దెబ్బతీస్తోంది:
రెండు నెలల క్రితం వన్డే ఫార్మాట్‌లో విశ్వవిజేతగా నిలిచిన జట్టు ప్రతిష్ఠాత్మక సిరీస్‌లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నది. ముఖ్యంగా జట్టుకు మూలస్తంభమైన కెప్టెన్ రూట్ ఫామ్ ఇంగ్లండ్‌ను దెబ్బతీస్తోంది. ఇప్పటికైనా అతడు ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఉంది. జాసన్ రాయ్ ఆకట్టుకోలేకపోయాడు. గాయంతో బాధపడుతున్న స్టోక్స్ బ్యాటింగ్‌కే పరిమితం కానున్నాడు. బెయిర్‌స్టో, బట్లర్ ఏ మాత్రం రాణించడం లేదు.
సుఖేశ్ హెగ్డే పోరాటం.. హోరాహోరీ పోరులో ముంబాపై బెంగాల్ ఉత్కంఠ విజయం

అండర్సన్ లోటు:
ఓపెనర్ బర్న్స్ కొన్ని చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడినా.. అతడిలో నిలకడ లోపించింది. మరో ఓపెనర్ డెన్లీ కూడా మోస్తరుగా ఆడుతున్నాడు. బౌలింగ్‌లో సీనియర్ పేసర్ అండర్సన్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నది. ఆర్చర్ ఆకట్టుకుంటున్నా.. ఆ స్థాయిలో మెరిపించలేకపోతున్నాడు. బ్రాడ్ నిలకడగా వికెట్లు తీస్తున్నా ఆ ప్రదర్శన సరిపోవట్లేదు. దీంతో అందరు సమిష్టిగా రాణిస్తేనే విజయం వరించే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications