న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ashes 2019: హెడెంగ్లీలో చరిత్ర పునరావృతం అవుతుందా?

Ashes 2019: Englands third Test against Australia in numbers

హైదరాబాద్: యాషెస్ సిరిస్‌లో భాగంగా మూడో టెస్టు హెడెంగ్లే వేదికగా గురువారం నుంచి ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించగా... లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో ప్రస్తుతం యాషెస్ సిరిస్‌లో ఆస్ట్రేలియా జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది.

లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో తొలి రోజు వర్షం కారణంగా ఆట తుడిచిపెట్టుకు పోగా ఆ తర్వాత ఉత్కంఠగా మారి... చివరకు డ్రాగా ముగిసింది. యాషెస్ సిరీస్‌లో స్టీవ్ స్మిత్ టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్సుల్లోనూ రెండు సెంచరీలతో చెలరేగిన స్మిత్... రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు సాధించాడు.

<strong>రేపే ఫలితాలు: ఇంటర్వ్యూలకు హాజరైన బంగర్‌, శ్రీధర్‌, అరుణ్‌, జాంటీ రోడ్స్‌ </strong>రేపే ఫలితాలు: ఇంటర్వ్యూలకు హాజరైన బంగర్‌, శ్రీధర్‌, అరుణ్‌, జాంటీ రోడ్స్‌

ఆండర్సన్ స్థానంలో జోఫ్రా ఆర్చర్

ఆండర్సన్ స్థానంలో జోఫ్రా ఆర్చర్

జేమ్స్ ఆండర్సన్ గాయంతో రెండో టెస్టుకు దూరమైన నేపథ్యంలో చోటు దక్కించుకున్న ఆర్చర్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా లైన్ అండ్ లెంత్ బంతులతో ఆసీస్ బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెట్టాడు. లార్డ్స్ టెస్టులో జోఫ్రా ఆర్చర్‌ 148.7 కిలోమీటర్ల వేగంతో సంధించిన బంతిని స్టీవ్ స్మిత్ మెడకు బలంగా తాకడంతో స్మిత్ మైదానంలో కుప్పకూలాడు.

మూడో టెస్టుకు స్మిత్ దూరం

మూడో టెస్టుకు స్మిత్ దూరం

ఆసీస్ జట్టు ఫిజియో ప్రాథమిక చికిత్స అనంతరం స్టీవ్ స్మిత్ మెల్లగా రావడంతో ఒక్కసారిగా అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత స్మిత్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. గాయం నుంచి ఇంకా కోలుకోని స్మిత్ మూడో టెస్టుకు అందుబాటులో ఉండడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది. ఫామ్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ మూడో టెస్టుకు దూరం కావడం ఇంగ్లాండ్‌కు కలిసి రానుంది.

అతడి బౌలింగ్‌లో పేస్‌తో పాటు కచ్చితత్వం ఉంది: ఆర్చర్‌కు మెక్‌గ్రాత్ ప్రశంస

హెడెంగ్లీలో నమోదైన గణాంకాలివే

హెడెంగ్లీలో నమోదైన గణాంకాలివే

8 - ఇంగ్లాండ్‌తో జరిగిన గత ఎనిమిది టెస్టుల్లో ఆస్ట్రేలియా ఆరింట విజయం సాధించి.. రెండు టెస్టులను డ్రాగా చేసుకుంది. 1987 నుంచి 1993 మధ్య కాలంలో ఆస్ట్రేలియా వరుసగా 18 యాషెస్ టెస్టుల్లో ఓటమనేది రుచి చూడలేదు.

1 - యాషెస్ సిరిస్‌లో ఆస్ట్రేలియా మరోక టెస్టులో విజయం సాధిస్తే యాషెస్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో ఇప్పటికే రెండు టెస్టులు ముగిశాయి. ఆస్ట్రేలియా ఒక దాంట్లో విజయం సాధించగా... మరొక టెస్టు డ్రా అయింది. సొంతగడ్డపై ఇంగ్లాండ్ చివరగా 2001లో యాషెస్‌ను కోల్పోయింది.

4 - ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా బౌలర్ పీటర్ సిడ్ఢిల్ నాలుగు మ్యాచ్‌లు జారవిడిచాడు. యాషెస్ సిరిస్‌లో ఒక బౌలర్ అత్యధిక క్యాచ్‌లను జారవిడవడం ఇదే తొలిసారి.

హెడెంగ్లీలో స్టువర్ట్ బ్రాడ్‌కు మంచి రికార్డు

హెడెంగ్లీలో స్టువర్ట్ బ్రాడ్‌కు మంచి రికార్డు

42 - ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌కు హెడెంగ్లేలో మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు స్టువర్ట్ బ్రాడ్ ఆ పిచ్‌పై 26.8 యావరేజితో 42 టెస్టు వికెట్లు తీశాడు. ఈ పిచ్‌పై మరో మూడు వికెట్లు తీస్తే యార్క్ షైర్ గ్రేట్ ఫ్రెడ్ ట్రుమన్ రికార్డుని బద్దలు కొడతాడు.

2014 - యాషెస్ సిరిస్‌లో వరుసగా రెండు టెస్టులు డ్రాగా ముగిసిన సందర్భం.

7 - మూడో టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న హెడెంగ్లే స్టేడియంలో గత 9 మ్యాచ్‌ల్లో టాస్ ఓడిన జట్లే 7 సార్లు విజయం సాధించాయి.

2 - హెడెంగ్లేలో ఇంగ్లాండ్ చివరగా ఆడిన రెండు టెస్టుల్లోనూ విజయం సాధించింది.

Story first published: Wednesday, August 21, 2019, 15:20 [IST]
Other articles published on Aug 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X