For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫ్లాష్ బ్యాక్ 2018: క్రికెట్ ఏడాదిలో అత్యధిక సెంచరీలు చేసిందెవరంటే!!

As the year 2018 comes to an end, a brief look at high runs getters in international cricket:

హైదరాబాద్: 2018 ఏడాది చివరకి వచ్చేసింది. కొత్త ఆశలతో భారీ అంచనాలతో నూతన వసంతంలోకి అడుగుపెట్టే వేళైంది. నూతన ఉత్తేజంతో 2019లోకి అడుగుపెట్టే ముందు ఈ ఏడాది సాధించిన క్రికెట్ విజయాలను నెమరేసుకుంటే.. కోహ్లీనే ది బెస్ట్‌గా నిలిచాడు. పైగా ఈ ఏడాది మ్యాచ్‌ల మధ్యలో విరామాలు తీసుకుంటున్నప్పటికీ అరుదైన ఘనతలు సాధించాడు. క్రీజులో నిలబడడం ఒక ఎత్తైతే బౌలర్లను ఎదుర్కొంటూ బౌండరీలను శాసించడం మరో సమరం. ఇక సెంచరీల మాటైతే.. చెప్పే పనే లేదు. ఈ ఏడాది మరిన్ని ఘనతలు సాధించిన క్రికెటర్ల గురించి విశ్లేషిస్తే..

5 టెస్టు సెంచరీలతో కోహ్లీనే టాప్:

5 టెస్టు సెంచరీలతో కోహ్లీనే టాప్:

సంవత్సరాంతంలో అత్యధిక పరుగులు సాధించిన కోహ్లీనే.. టెస్టుల్లో అధిక సెంచరీలు బాదిన క్రికెటర్‌గా ఘనత సాధించాడు. కోహ్లీ ఆడిన 12 టెస్టుల్లో కోహ్లీ కేవలం 5 సెంచరీలు మాత్రమే చేశాడు. సెంచూరియా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఈ ఏడాది తొలి సెంచరీ(153)ని నమోదు చేశాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బర్మింగ్‌హామ్‌లో 149, నాటింగ్‌హామ్‌లో 103 పరుగులు చేశాడు. సొంతగడ్డపైనే వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో నాలుగో సెంచరీ బాదాడు. అక్టోబర్‌లో రాజ్‌కోట్‌లో విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 139 పరుగులు చేసిన కోహ్లీ.. కెప్టెన్‌గా 30 సెంచరీలు పూర్తి చేశాడు. ఇక పెర్త్ టెస్టులో చేసిన 123 పరుగులు కోహ్లీకి ఇది ఐదో సెంచరీ.

ఫ్లాష్ బ్యాక్ 2018: క్రికెట్ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసింది కోహ్లీనే!!

విరామాలున్నప్పటికీ వన్డేల్లోనూ..:

విరామాలున్నప్పటికీ వన్డేల్లోనూ..:

ఈ ఫార్మాట్‌లోనూ విరాట్ కోహ్లీనే టాప్‌గా నిలిచాడు. 2018 మొత్తంలో కోహ్లీ వన్డే ఆరు సెంచరీలు చేశాడు. ఏడాది మొత్తంలో 14 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లోనే 3 సెంచరీలు బాదాడు. డర్బన్ వన్డేలో 112, కేప్ టౌన్‌లో 160 (నాటౌట్), సెంచూరియన్ 129 (నాటౌట్) పరుగులు చేశాడు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తూ ఆ తరవాత కూడా వరసగా 3 సెంచరీలు చేయగలిగాడు. గువాహటి వన్డేలో 140, విశాఖపట్నంలో 157 నాటౌట్, పుణేలో 107 పరుగులతో వెస్టిండీస్‌ బౌలర్లపై కోహ్లీ విరుచుకుపడ్డాడు. అక్టోబర్ 24న విశాఖలో 37వ వన్డే సెంచరీని నమోదుచేసిన కోహ్లీ.. సచిన్ పేరిట ఉన్న 10వేల పరుగుల రికార్డును వేగంగా పూర్తిచేసి నూతన రికార్డును బద్దలుకొట్టాడు.

షార్ట్ ఫార్మాట్‌లో సత్తాచాటిన రోహిత్:

షార్ట్ ఫార్మాట్‌లో సత్తాచాటిన రోహిత్:

ఈ ఏడాది టీ20ల్లో భారత ఓపెనర్ రోహిత్ శర్మదే పైచేయి. షార్ట్ ఫార్మాట్‌లో దూసుకెళ్తున్న రోహిత్ ఈ ఏడాది 2 సెంచరీలు బాదేశాడు. జూలై 8న బ్రిస్టల్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి సెంచరీని చేయగలిగాడు. కేవలం 56 బంతుల్లో 5 సిక్సులు, 11 ఫోర్ల సాయంతో రోహిత్ 100 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌తో నవంబర్ 6న లక్నోలో జరిగిన మ్యాచ్‌లో రెండో సెంచరీని నమోదు చేశాడు. ఏడాది మొత్తంలో చూసుకుంటే కెరీర్‌లో రోహిత్‌కు ఇది నాలుగో సెంచరీ.

Story first published: Tuesday, December 25, 2018, 12:40 [IST]
Other articles published on Dec 25, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+