ప్లాష్ బ్యాక్ 2018: సంపాదనలో టాప్-10 స్పోర్ట్స్ సెలబ్రిటీలు వీరే

హైదరాబాద్: 2018లో ప్రఖ్యాత ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన టాప్-100 జాబితాలో టాప్ టెన్‌లో కేవలం ముగ్గురు క్రికెటర్లు మాత్రమే చోటు దక్కించుకోగా... పురుషుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహిళా క్రీడాకారిణుల జాబితాలో స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవి సింధు అగ్రస్థానంలో నిలిచారు.
మొత్తం జాబితాలో 21 మంది స్పోర్ట్స్ సెలబ్రిటీలు చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 100 శాతం అధిక సంపాదనతో స్పోర్ట్స్ సెలబ్రిటీల లిస్ట్‌లో కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. ఇక, మహిళల జాబితాలో కేవలం పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు మాత్రమే చోటు దక్కింది.
సంపాదనలో టాప్-10 స్పోర్ట్స్ సెలబ్రిటీలు

విరాట్ కోహ్లీ
గతేడాదితో పోలిస్తే 2018లో విరాట్ కోహ్లీ ఆదాయం వంద శాతం పెరిగింది. మొత్తంగా ఫోర్బ్స్ జాబితాలో 228.9 కోట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ (రూ. 16.48 కోట్లతో 59వ స్థానం), బుమ్రా (రూ. 16.42 కోట్లతో 60వ స్థానం), శిఖర్ ధావన్(రూ.16.26 కోట్లతో 62వ స్థానం)లో నిలిచారు.

మహేంద్ర సింగ్ ధోని
వయసు పెరుగుతున్నప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనికి క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ ఏడాది ధోని 101.77 కోట్లతో ఫోర్బ్స్‌లో ఐదవ ర్యాంకులో నిలిచాడు.

సచిన్ టెండూల్కర్
క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. అంతర్జాతీయ క్రికెట్‌కు 2013లోనే వీడ్కోలు పలికినప్పటికీ సచిన్ సంపాదన మాత్రం తగ్గలేదు. రూ. 80 కోట్లతో ఫోర్బ్స్‌లో తొమ్మిదో ర్యాంకుని దక్కించుకున్నాడు.

పీవి సింధు
రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించడంతో పీవీ సింధు క్రేజ్ అమాంతం పెరిగింది. మొత్తం రూ. 36.5 కోట్లతో ఫోర్బ్స్ జాబితాలో నాలుగో ర్యాంకులో నిలిచింది.

రోహిత్ శర్మ
సంపాదనలో రోహిత్ శర్మ రూ. 31.49 కోట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. ఇక, ఫోర్బ్స్ ర్యాంక్ విషయానికి వస్తే 23 స్థానంలో నిలిచాడు.

హార్ధిక్ పాండ్యా
అతి తక్కువ సమయంలో భారత జట్టులో స్టార్ ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. రూ. 28.46 కోట్లతో ఆరో స్థానంలో నిలిచాడు. ఇక ఫోర్బ్స్ ర్యాంక్ విషయానికి వస్తే 27 స్థానంలో నిలిచాడు.

రవిచంద్రన్ అశ్విన్
టీమిండియా వెటనర్ స్పిన్నర్. ఈ ఏడాది అత్యధిక సంపాదనలో అశ్విన్ రూ. 18.9 కోట్లతో ఐడో స్థానంలో నిలిచాడు. ఇక, ఫోర్బ్స్ ర్యాంక్ విషయానికి వస్తే 44వ స్థానంలో నిలిచాడు.

భువనేశ్వర్ కుమార్
భారత పేస్ బౌలింగ్ దళాన్ని నడిపించే ప్రధాన పేసర్. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భువనేశ్వర్ ఆదాయం 500 శాతం పెరిగింది. మొత్తం 17.26 కోట్లతో ఫోర్బ్స్ జాబితాలో 52వ స్థానంలో నిలిచాడు.

సురేష్ రైనా
టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్. మొత్తం రూ. 16.96 కోట్లతో ఫోర్బ్స్ జాబితాలో 55వ స్థానంలో నిలిచాడు.

సైనా నెహ్వాల్
లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన సైనా నెహ్వాల్‌కి ఈ ఏడాది సంపాదన బాగానే ఉంది. మొత్తం రూ. 16.54 కోట్లతో ఫోర్బ్స్ జాబితాలో 58వ స్థానంలో నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications