Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెహ్వాగ్ వారసుడికి బిగ్ ప్రమోషన్.. ఇక విధ్వంసం షురూ!

టీమిండియా మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ధనాధన్ బ్యాటింగ్ తో భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన వారసుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా తండ్రి బాటలోనే వేగంగా దూసుకొస్తున్నాడు. 18 ఏళ్ల ఈ యువ బ్యాటర్‌కు ఢిల్లీ క్రికెట్లో అరుదైన అవకాశం దక్కింది. రాబోయే ప్రతిష్టాత్మక వినూ మంకడ్ ట్రోఫీ కోసం ఆర్యవీర్ సెహ్వాగ్‌ను ఢిల్లీ అండర్-19 జట్టు కెప్టెన్‌గా నియమిస్తూ కీలక బాధ్యతలు అప్పగించారు.

ధోనీ బాటలో గిల్: కెప్టెన్ తీసుకున్న ఆ నిర్ణయం అందరినీ ఆకట్టుకుంది! (వీడియో)

ధోనీ బాటలో గిల్: కెప్టెన్ తీసుకున్న ఆ నిర్ణయం అందరినీ ఆకట్టుకుంది! (వీడియో)

ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వినూ మంకడ్ ట్రోఫీ కోసం 16 మంది సభ్యులతో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది. విశాఖపట్నం వేదికగా అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో ఢిల్లీ జట్టును ఆర్యవీర్ ముందుకు నడిపించనున్నాడు. ఓ ప్రధాన జట్టుకు నాయకత్వం వహించడం ఆర్యవీర్‌కు ఇదే తొలిసారి కావడంతో ఈ నిర్ణయం ఆసక్తికరంగా మారింది. జట్టుకు అర్నవ్ బుగ్గా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

Aryavir Sehwag Named Delhi U-19 Captain for Vinoo Mankad Trophy 2026 in Visakhapatnam Full Details Here

గత కొన్ని నెలలుగా ఆర్యవీర్ సెహ్వాగ్ అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తున్నాడు. ఇటీవల రాజ్‌కోట్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన యూత్ వన్డే సిరీస్‌లో భారత అండర్-19 జట్టు తరఫున ఆడి తన సత్తా చాటాడు. వర్షం కారణంగా అంతరాయం కలిగిన తొలి మ్యాచ్‌లో 28 పరుగులు సాధించిన ఆర్యవీర్.. రెండో మ్యాచ్‌లో 47 పరుగులతో మెరిసి తృటిలో అర్థసెంచరీ చేజార్చుకున్నాడు. ఇక మూడో వన్డేలో కూడా 34 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో భాగమయ్యాడు.

అసలు వాళ్లు మన రేంజా అస్సలు కాదు.. ఇకనైనా పోలికలు ఆపేయండి సామీ!

Also Read

అసలు వాళ్లు మన రేంజా అస్సలు కాదు.. ఇకనైనా పోలికలు ఆపేయండి సామీ!

అంతే కాకుండా ఢిల్లీ ప్రీమియర్ లీగ్(డీపీఎల్)లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆర్యవీర్ సెహ్వాగ్.. అంతకుముందు కూచ్ బెహార్ ట్రోఫీలో మేఘాలయపై ఏకంగా 297 పరుగులతో భారీ ఇన్నింగ్స్ ఆడి క్రికెట్ వర్గాల దృష్టిని ఆకర్షించాడు. నాయకుడిగా, బ్యాటర్‌గా వినూ మంకడ్ ట్రోఫీలో తన ముద్ర వేసేందుకు ఆర్యవీర్ కు ఇది సరైన వేదిక కానుంది.

ఢిల్లీ అండర్-19 జట్టు:
ఆర్యవీర్ సెహ్వాగ్ (కెప్టెన్), తన్మయ్ చౌదరి, అర్నవ్ బుగ్గా (వైస్ కెప్టెన్), ధన్య నక్రా, ఉదయ్ చావ్లా, గర్వ్ కుమార్, అభిరాజ్ గగన్ సింగ్ (వికెట్ కీపర్), తరుణ్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్యన్ శర్మ, ఓజస్దీప్ సింగ్, కిరీట్ కౌశిక్, ధృవ్, వరుణ్ ప్రసాద్, వేదాంత్, యష్ రాజ్, శంతను యాదవ్.

Story first published: Sunday, October 4, 2026, 18:25 [IST]
Other articles published on Oct 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+