For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021 Auction: జూహీ చావ్లా కుమార్తెతో షారుఖ్‌ ఖాన్ తనయుడు.. ఇద్దరికి ఇదే తొలిసారి!!

Aryan Khan, Jahnavi Mehta attends IPL auction for the first time for Kolkata Knight Riders
IPL 2021 Auction : Shah Rukh's Son Aryan, Juhi's Daughter Jahnavi Spotted - Pic Viral || Oneindia

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2021 వేలం ఊహించినదానికంటే రెట్టింపు ఉత్కంఠతో సాగింది. గతేడాది ఆటగాళ్ల ప్రదర్శనలను ఫ్రాంచైజీలు దృష్టిలో పెట్టుకోలేదు. ప్రాంచైజీ యజమానులు ఆటగాళ్లపై పూర్తి నమ్మకం ఉంచారు. అందుకే గతేడాది తీవ్రంగా నిరాశపరిచిన ఆటగాళ్లకు కూడా అనూహ్య ధర పలికింది. యువ ఆటగాళ్లపై కూడా కాసుల వర్షం కురిసింది. క్రిస్ మోరిస్‌, గ్లెన్ మాక్స్‌వెల్‌, మొయిన్‌ అలీ, శివమ్‌ దూబె, షకిబ్‌ లాంటి స్టార్ ఆటగాళ్లతో పాటు కృష్ణప్ప గౌతమ్‌, షారుఖ్‌ ఖాన్‌ లాంటి ఆన్ క్యాప్‌డ్ వారికి కూడా భారీ ధర దక్కింది. అయితే వేలంలో ఆటగాళ్లు మాత్రమే కాదు.. ఫ్రాంచైజీ యజమానులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఇదే తొలిసారి

ఇదే తొలిసారి

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్, బాలీవుడ్‌ సీనియర్‌ నటి జూహీ చావ్లా తనయ జాహ్నవి మెహతా ఐపీఎల్ 2021లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇద్దరూ వేలంలో పాల్గొనడం ఇదే తొలిసారి. కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రాంచైజీకి షారుఖ్‌, జూహీ భర్త జై మెహతా సహ యజమానులు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నై వేదికగా గురువారం జరిగిన ఈ క్యాష్‌ రిచ్ ‌లీగ్‌ మినీ వేలంలో తండ్రి జై మెహతాతో పాటు జాహ్నవి కూడా పాల్గొన్నారు. తద్వారా వేలంలో పాల్గొన్న అతిపిన్న వయస్కురాలి (19)గా నిలిచారు.

యంగెస్ట్‌ బిడ్డర్‌గా

యంగెస్ట్‌ బిడ్డర్‌గా

తన కుమార్తె వేలంలో పాల్గొనడంతో జూహీ చావ్లా ఆనందంలో తేలిపోయారు. 'కోల్‌కతా నైట్‌రైడర్స్ కిడ్స్‌ను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఆర్యన్‌ ఖాన్‌, జాహ్నవి మెహతా వేలం పాటలో పాల్గొన్నారు' అని ట్వీట్ చేశారు. తన కూతురు జాహ్నవి, షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ కలిసి ఉన్న ఫొటోను ఆమె ట్విటర్‌లో షేర్‌ చేశారు. 'ఐపీఎల్‌ వేలం చరిత్రలో యంగెస్ట్‌ బిడ్డర్‌గా మా జాహ్నవి మెహతా. చెన్నై పర్యటన, ఈవెంట్‌కు సంబంధించిన విశేషాలు ఆమె అందిస్తున్నారు' అంటూ కేకేఆర్‌ తన అధికారిక సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేసింది.

ఆర్యన్, జాహ్నవి ఫొటో వైరల్

ఆర్యన్, జాహ్నవి ఫొటో వైరల్

కేకేఆర్‌ ట్వీట్‌పై స్పందించిన జూహీ చావ్లా పుత్రికోత్సాహంతో పొంగిపోతూ హర్షం వ్యక్తం చేశారు. ఆర్యన్, జాహ్నవి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'వీళ్లిద్దరు ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. కొత్త తరానికి బాధ్యతలు అప్పగించే సమయం వచ్చేసింది' అంటూ కేకేఆర్‌ ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు. జూహీ చావ్లా- జై మెహతా దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె జాహ్నవి, కుమారుడు అర్జున్‌ మెహతా. రూ.10.75 కోట్లతో కేకేఆర్‌ వేలానికి వెళ్లిన సంగతి తెలిసిందే. షకీబ్‌ అల్‌ హసన్‌, కరుణ్‌ నాయర్, హర్భజన్‌ సింగ్ లాంటి స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది.

వేలంలో కేకేఆర్‌ దక్కించుకున్న ఆటగాళ్లు

వేలంలో కేకేఆర్‌ దక్కించుకున్న ఆటగాళ్లు

షకీబ్‌ అల్‌ హసన్‌- రూ. 3.2 కోట్లు

హర్భజన్‌ సింగ్‌- రూ. 2 కోట్లు

కరుణ్‌ నాయర్‌- రూ. 50 లక్షలు

బెన్‌ కటింగ్‌- రూ.75లక్షలు

వెంకటేస్‌ అయ్యర్‌- రూ.20లక్షలు

పవన్‌ నేగి- రూ.50లక్షలు

IPL 2021 Auction: నాన్న మాట విని తప్పు చేశా.. అమ్మ మాట వింటే ఇప్పుడు కింగ్ అయ్యేవాడిని: దినేశ్‌ కార్తిక్‌

Story first published: Friday, February 19, 2021, 11:49 [IST]
Other articles published on Feb 19, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+