న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సుశాంత్ మృతిపై స్పందించని ధోనీ.. కారణాలు ఇవేనా?!!

Arun Pandey says MS Dhoni Was Impressed To See Sushants Dedication, Death Has Left Him Speechless
Sushant Singh Rajput : MS Dhoni Didn't React On His Biopic Hero Why ?

హైదరాబాద్: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ముంబైలోని తన ఇంట్లో ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సుశాంత్‌ బాలీవుడ్‌ నటుడే కానీ.. క్రికెట్‌ చూసే ప్రతీ ఒక్కరికీ అతనో 'బాలీవుడ్‌ ఎంఎస్‌ ధోనీ'. భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ జీవిత కథ ఆధారంగా నిర్మించిన 'ఎంఎస్‌ ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ' సినిమాలో మహీ పాత్రలో పరకాయ ప్రవేశం చేసారు. డిప్రెషన్‌ కారణంగా 34 ఏళ్ల సుశాంత్‌ ఆత్మహత్యకు పాల్పడటంతో క్రికెట్‌ వర్గాలు విస్తుపోయాయి.

సుశాంత్ మృతిపై స్పందించని ధోనీ

సుశాంత్ మృతిపై స్పందించని ధోనీ

పలువురు క్రికెటర్లు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ విషాదాంతంపై విస్మయానికి లోనయ్యారు. చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయావు మిత్రమా అంటూనే.. ఈ వార్త అబద్ధమైతే బావుండంటూ సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ధోనీ బయోపిక్ ద్వారానే స్టార్ హోదాని దక్కించుకున్న సుశాంత్‌ మృతిపై ఎంఎస్ ధోనీ ఎలా స్పందిస్తాడో అని అతని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ధోనీ నుంచి ఇప్ప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. దీంతో నెటిజన్లు కారణం వెతికే పనిలో పడ్డారు.

మహీకి చాలా కోపం వచ్చింది

మహీకి చాలా కోపం వచ్చింది

అయితే నెటిజన్లకు పెద్దగా పనివ్వకుండా.. మహీ మేనేజర్, ఎంఎస్ ధోనీ బయోపిక్ సహ నిర్మాత అరుణ్ పాండే స్పందించారు. 'సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ సూసైడ్‌ని మేము ఇంకా నమ్మలేకపోతున్నాం. నా బాధ వర్ణణాతీతం. ఆ ఆత్మహత్య గురించి వినగానే మహీకి చాలా కోపం వచ్చింది' అని అరుణ్ పాండే తెలిపారు. దీంతో సుశాంత్‌ సూసైడ్ చేసుకోవడం ధోనీకి నచ్చలేదని, అందుకే స్పందించలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ధోనీ సోషల్ మీడియాకి కాస్త దూరంగా ఉంటాడు కాబట్టి.. అందుకే స్పందించలేదంటున్నారు.

వారం రోజుల పాటు ప్రాక్టీస్

వారం రోజుల పాటు ప్రాక్టీస్

సినిమాలో ధోనీలా కనిపించడం కోసం సుశాంత్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదని నిర్మాత అరుణ్‌ పాండే తెలిపారు. 'తాను మహీ లాగ మెప్పించలేకపోతే కోట్లాది మంది అతని అభిమానులు క్షమించరని సుశాంత్‌ అంటుండేవాడు. అందుకే ఆ పాత్ర కోసం విపరీతంగా శ్రమించాడు. ఒక రోజు హెలికాఫ్టర్‌ షాట్‌ సాధన చేస్తుండగా.. కండరాలు పట్టేశాయి. అతను విశ్రాంతి తీసుకుంటాడని అనుకున్నాం. కానీ.. నొప్పితోనే సాధన కొనసాగించాడు. వారం రోజుల పాటు ఆ షాట్‌ను ప్రాక్టీస్‌ చేసి పట్టు సాధించాడు. ధోనీలా మారే క్రమంలో తన పాత ఇంటికి వెళ్లి అతను పడుకున్న చోటే నేల మీద పడుకుని నిద్రపోయాడు' అని పాండే చెప్పారు.

ధోనీతో కలిసి చాలా రోజులు ప్రయాణం

ధోనీతో కలిసి చాలా రోజులు ప్రయాణం

సినిమా అద్భుతంగా తెరకెక్కడంలో తెరవెనుక భారత మాజీ వికెట్‌ కీపర్‌ కిరణ్‌ మోరే విలువైన సలహాలిచ్చారు. 2016లో‌ ధోనీ తరహాలో బ్యాటింగ్‌, వికెట్‌ కీపింగ్‌ చేయడంలో ఆయనే సుశాంత్‌కు శిక్షణ ఇచ్చారు. ధోనీ హెలికాప్టర్‌ షాట్‌, కవర్‌లో షాట్‌ ఆడటం, గ్లోవ్స్‌ ఉపయోగించే విధానం లాంటివి శిక్షణ ఇచ్చేందుకు మోరే..సుశాంత్‌తో చాలా నెలల పాటు కలిసి పనిచేశారు. మరోవైపు సినిమా కోసం ధోనీతో కలిసి చాలా రోజులు సుశాంత్ ట్రావెల్ చేశారు. ఆ క్రమంలో ధోనీ ఫ్యామిలీకి కూడా చాలా క్లోజ్ అయ్యారు. సినిమా చూసిన తర్వాత సుశాంత్ అంకితభావానికి ధోనీ ఫిదా అయ్యారట.

బెస్ట్ ఫీల్డర్ ఎవరో చెప్పిన రోహిత్.. మండిపడుతున్న ఫ్యాన్స్!!

Story first published: Monday, June 15, 2020, 14:19 [IST]
Other articles published on Jun 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X