Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అప్పుడు ఆ గ్యాప్ రాకుంటే సౌరవ్‌ గంగూలీ ఈ స్థాయిలో ఉండేవాడు కాదు: మాజీ క్రికెటర్

 Arun Lal remembers incident that propelled Sourav Ganguly for success

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ కెరీర్ ప్రారంభంలో జట్టుకు దూరం కాకుంటే ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవాడు కాదని భారత మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ అభిప్రాయపడ్డాడు. 1992లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన దాదా.. పేలవమైన ఆట తీరుతో జట్టుకు దూరమయ్యాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌పై అరంగేట్ర టెస్ట్‌లో సెంచరీ చేశాడు. ఈ నాలుగేళ్ల గ్యాప్ గంగూలీని ఎంతో మెచ్యూర్ క్రికెటర్‌గా మార్చిందని అరుణ్ లాల్ తెలిపాడు.

సిక్స్‌లన్నీ మైదానం బయటే..

సిక్స్‌లన్నీ మైదానం బయటే..

గంగూలీ ఓ అద్భుతమైన ఆటగాడని కొనియాడిన ఈ మాజీ క్రికెటర్.. దాదా 16 ఏళ్ల వయసులోనే అలవోకగా సిక్స్‌లుకొట్టేవాడని ‘స్పోర్ట్స్ కీదా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. ‘నేనేప్పటికీ సచిన్‌ టెండూల్కర్‌లానే గంగూలీని అభిమానిస్తాను. అతనంటే నాకు చాలా ప్రత్యేకం. దాదా యుక్త వయసులో ఉన్నప్పుడు కోల్‌కతా‌లో సీసీఎఫ్ తరఫున అతను ఆడిన మ్యాచ్ నాకింకా గుర్తుంది. ఆ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో ఈ కుర్రాడు 6-7 సిక్స్‌లు కొట్టాడు. దాదాపు సిక్స్‌లన్నీ మైదానం బయటే పడ్డాయి. అప్పడు అతని వయసు 16-17 ఏళ్లు మాత్రమే. సచిన్‌లా గంగూలీ కూడా క్రికెట్ కోసమే పుట్టాడు. అతనిలో అసాధారణమైన ప్రతిభ ఉండేది.'అని అరుణ్ లాల్ దాదాను ప్రశంసించాడు.

ఆ ఎదురుదెబ్బే..

ఆ ఎదురుదెబ్బే..

ఇక కెరీర్ ప్రారంభంలో దాదాకు వచ్చిన నాలుగేళ్ల గ్యాప్ అతనిలో మరింత కసిని రగిల్చిందని అరుణ్ లాల్ తెలిపాడు. ‘సౌరవ్ కెరీర్ ప్రారంభంలోనే ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నాడు. ఆదిలోనే జట్టులో చోటు కోల్పోయాడు. దాదా నాలుగేళ్లు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఆ గ్యాప్ అతన్ని మరింత రాటుదేలేలా చేసింది. ఆ రోజు ఇలా కాకుండా ఉంటే దాదా ఈ స్థాయిలో ఉండేవాడు కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ నాలుగేళ్ల విరామం అతన్ని మెచ్యూరిటీ ఆటగాడిగా మార్చింది. పరిస్థితులను అర్థం చేసుకునే శక్తినిచ్చింది. దాంతో సౌరవ్ కెప్టెన్ అయ్యాడు. ప్రస్తుతం బీసీసీఐని నడిపిస్తున్నాడు'అని అరుణ్ లాల్ చెప్పుకొచ్చాడు.

 అతని గొప్పతనాన్ని చూడలేదు..

అతని గొప్పతనాన్ని చూడలేదు..

ఇక భవిష్యత్తులో దాదా మరిన్ని ఘనతలు అందుకుంటాడని, ప్రపంచక్రికెట్‌పై తన మార్క్‌ వేసుకుంటాడని ఈ మాజీ క్రికెటర్ కమ్ కామెంటేటర్ జోస్యం చెప్పాడు. ‘అతనిలోని గొప్పతనాన్ని మనం ఇంకా చూడలేదనేది నా నమ్మకం. అతని మంచిరోజులు ముందున్నాయి'అన్నాడు. ఐసీసీ ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలున్నాయని అరుణ్‌లా పరోక్షంగా తెలిపాడు. భారత్ తరఫున 16 టెస్ట్‌లు, 13 వన్డేలు ఆడిన అరుణ్‌లాల్.. టెస్ట్‌ల్లో 729, వన్డేల్లో 122 రన్స్ చేశాడు.

Story first published: Friday, July 17, 2020, 13:29 [IST]
Other articles published on Jul 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+