ఎవరూ ఒత్తిడి చేయలేదు.. కోహ్లీనే తప్పుకున్నాడు: బీసీసీఐ ట్రెజరర్

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీనే స్వయంగా తప్పుకున్నాడని, అతన్ని ఎవరూ ఒత్తిడి చేయలేదని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధూమల్ స్పష్టం చేశాడు. విరాట్‌ను జట్టు నుంచి తప్పించడానికి బీసీసీఐ కుట్ర చేస్తోందని జరగుతున్న ప్రచారాన్ని ఖండించాడు. ఈ ఏడాది జనవరిలో సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం విరాట్ తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ అనంతరం పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతలను విరాట్ వదులుకోగా.. వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించింది. అప్పట్లో ఈ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగింది.

ఏడు నెలల తర్వాత క్లారిటీ..
కోహ్లీని సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ తెలపగా.. అలాంటిదేం జరగలేదని కోహ్లీ మీడియాతో కుండబద్దలు కొట్టాడు. తనను ఎవరూ సంప్రదించలేదని చెప్పాడు. టెస్ట్ సారథిగా అవకాశం ఉన్నా కోహ్లీ తప్పుకున్నాడు. అప్పటి నుంచి ఈ విషయంలో బీసీసీఐ మౌనం పాటించింది. ఏడు నెలల అనంతరం ఈ కెప్టెన్సీ వ్యవహారంపై బీసీసీఐ ట్రెజరర్ తొలిసారి స్పందించాడు.

సాదాసీదా ఆటగాడు
..
కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం విరాట్ కోహ్లీ సొంత నిర్ణయమని చెప్పుకొచ్చాడు. కోహ్లీని తప్పించాలని బీసీసీఐ ప్రయత్నాలు చేస్తొందని వస్తుందన్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'విరాట్ సాదాసీదా ఆటగాడు కాదనే విషయాన్ని అందరూ గ్రహించాలి. అతను భారత క్రికెట్‌కు ఎంతో చేశాడు. అతనో అద్భుత ఆటగాడు. కోహ్లీని తప్పించాలని బోర్డు ప్రయత్నిస్తున్నట్లు జరుగుతున్న వార్తలు వాస్తవం కాదు. అలాంటి ప్రచారంతో బోర్డుకు జరిగే నష్టం ఏం లేదు.

బోర్డు జోక్యం చేసుకోదు..
త్వరలోనే కోహ్లీ ఫామ్ అందుకోవాలని కోరుకుంటున్నాం. టీమ్ సెలెక్షన్ అనేది సెలెక్టర్ల పని. దానిలో బోర్డు జోక్యం ఉండదు. కోహ్లీపై సెలెక్టర్లే సరైన నిర్ణయం తీసుకుంటారు. ఇక కెప్టెన్సీ విషయానికి వస్తే.. కోహ్లీనే స్వయంగా తప్పుకున్నాడు. నేను కెప్టెన్‌గా కొనసాగలేనని చెప్పాడు. ప్రపంచకప్ తర్వాత చాలా మంది అతను కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని కోరుకున్నారు. అయితే కోహ్లీనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అతని నిర్ణయాన్ని మేం గౌరవించాం. బోర్డులోని ప్రతీ ఒక్కరికి విరాట్ కోహ్లీ అంటే గౌరవం ఉంది. విరాట్ మైదానంలో ఉండాలని మేం కోరుకుంటున్నాం'అని ధూమల్ స్పష్టం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications