ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ సంచలన ప్రదర్శనతో సెలెక్టర్లను ఆకట్టుకుంటున్నాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్ష్‌దీప్ సింగ్ అద్భుత బౌలింగ్‌తో రాణిస్తున్నాడు. ముఖ్యంగా కొత్తబంతితో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. స్వింగ్, రివర్స్ స్వింగ్‌తో బ్యాటర్లను పెవిలియన్ చేర్చుతున్నాడు.
తాజాగా మహారాష్ట్రతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఫస్ట్ స్పెల్‌లోనే రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. స్టన్నింగ్ డెలివరీతో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(5)తో పాడు సిద్దేశ్ వీర్‌ను వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌కు రుతురాజ్ గైక్వాడ్(5) బిత్తరపోయాడు.

ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. మహారాష్ట్ర బ్యాటింగ్‌కు దిగింది. తొలి ఓవర్‌లోనే మహారాష్ట్రకు అర్ష్‌దీప్ సింగ్ బిగ్ షాకిచ్చాడు. వరుసగా ఐదు బంతులను ఇన్ స్వింగర్‌గా వేసి రుతురాజ్ గైక్వాడ్ లయను దెబ్బతీసిన అర్ష్‌దీప్ సింగ్.. ఆఖరి బంతిని మాత్రం ఔట్ స్వింగర్‌గా వేసి క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ బంతిని అంచనా వేయడంలో విఫలమైన రుతురాజ్ గైక్వాడ్.. ఇన్ స్వింగర్ కోసం ఆడి మూల్యం చెల్లించుకున్నాడు. బ్యాట్‌ను మిస్సైన బంతి ఆఫ్ స్టంప్ వికెట్‌ను లేపేసింది. రుతురాజ్ నిరాశగా పెవిలియన్ చేరాడు.
తన మరుసటి ఓవర్‌లోనూ లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్ సింగ్ సిద్దేశ్ వీర్(0) కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ రెండు వికెట్లకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో తొలి స్పెల్‌లో 5 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్ సింగ్ ఒక ఓవర్ మెయిడిన్ చేయడంతో పాటు 2 వికెట్లు పడగొట్టాడు.
8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ మహారాష్ట్రను అర్షిని కులకర్ణి ఆదుకున్నాడు. అసాధారణ బ్యాటింగ్‌తో శతకం దిశగా సాగుతున్నాయి. 40 ఓవర్లు ముగిసే సరికి మహారాష్ట్ర 3 వికెట్లకు 191 పరుగులు చేసింది.
ఈ టోర్నీలో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్ సింగ్ 17.36 సగటుతో 19 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో అతను ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్దంగా ఉన్నానని సెలెక్టర్లకు చాటి చెప్పాడు. జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో అర్ష్‌దీప్ సింగ్‌కు చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Delightful bowling 👌👌
— BCCI Domestic (@BCCIdomestic) January 11, 2025
Arshdeep Singh bowled an excellent first spell and picked up 2⃣ early wickets 🔥#VijayHazareTrophy | @IDFCFIRSTBank
Scorecard ▶️ https://t.co/eTrCnJbd5H pic.twitter.com/OSPU87Agtb