Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Arshdeep Singh: ఆ దేవుడితో పాటు అతనికి ధన్యవాదాలు!

IND vs SA: టీమిండియా తాత్కలిక వన్డే కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ధన్యవాదాలు తెలిపాడు. కెప్టెన్‌గా అతను ఇచ్చిన సహకారంతోనే సౌతాఫ్రికాతో తొలి వన్డేలో ఐదు వికెట్ల ఘనతను అందుకున్నానని తెలిపాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన భారత్ 8 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది.

ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ 5 వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు. సౌతాఫ్రికా గడ్డపై ఐదు వికెట్ల ఘనతను అందుకున్న తొలి భారత పేసర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అర్ష్‌దీప్ సింగ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశాడు.
'నాకు కాస్త నొప్పిగా ఉంది. కానీ ఈ క్షణాన్ని నేను ఆస్వాదిస్తున్నాను. ఆ దేవుడితో పాటు టీమ్‌మేనేజ్‌మెంట్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. సాధారణ మైదానాల కంటే ఇది కాస్త భిన్నంగా ఉంది. వ్యక్తిగతంగా ఈ ప్రదర్శన నాకు చాలా సంతోషాన్నిచ్చింది. నిజం చెప్పాలంటే పేసర్‌గా నేను ఊపిరి పీల్చుకున్నాను.

Arshdeep Singh says I would thank KL Rahul bhai after he pick ODI 5-wicket haul in IND vs SA 1st ODI

జట్టులో నా పాత్రను నే ఆస్వాదిస్తున్నాను. నేను రాహుల్ భాయ్ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే అతనే ఐదు వికెట్లు తీయగలవని ఎంకరేజ్ చేశాడు. ఇది నేను ఆస్వాదించే క్షణం. తదుపరి మ్యాచ్‌ల్లో మైదానా పరిస్థితులకు తగ్గట్లు మా బౌలింగ్ ప్రణాళికలుంటాయి.'అని అర్ష్‌దీప్ సింగ్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 116 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(5/37), ఆవేశ్ ఖాన్ (4/27) సఫారీ పతనాన్ని శాసించారు. ఫారీ బ్యాటర్లలో ఆండిలే పెహ్లుక్వాయో(49 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), టోనీ డీ జోర్జీ(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 16.4 ఓవర్లలోనే 2 వికెట్లకు 117 పరుగులు చేసి 200 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. రుతురాజ్ గైక్వాడ్(5) విఫలమైనా.. అరంగేట్ర ప్లేయర్ సాయి సుదర్శన్(43 బంతుల్లో 9 ఫోర్లతో 55 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(45 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు.

సౌతాఫ్రికా బౌలర్లలో వియాన్ ముల్దర్, ఆండిలో పెహ్లుక్వాయో తలో వికెట్ తీసారు.

Story first published: Sunday, December 17, 2023, 20:39 [IST]
Other articles published on Dec 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+