కెమెరా ముందే ప్రశాంతత.. నా నొప్పి నాకే తెలుసు: అర్ష్‌దీప్ సింగ్
కెమెరా ముందే ప్రశాంతంగా కనిపిస్తున్నానని, కానీ లోలోపల చాలా ఆందోళనకు గురవుతున్నానని టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తెలిపాడు. తమ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ సాయంతో బౌలింగ్‌ను మరింత మెరుగుపరుచుకోవడంపై ఫోకస్ పెట్టానని చెప్పాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తిరువనంతపురం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 46 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో 4-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ 5 వికెట్లతో సత్తా చాటాడు.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన అర్ష్‌దీప్ సింగ్.. వ్యక్తిగత ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా.. పరిపూర్ణమైన టీమ్ గేమ్ ఇంకా రాలేదన్నాడు. 'గేమ్‌లో నిలకడగా రాణించడం ఎలాగో నేర్చుకోవడానికి ఈ మ్యాచ్ నాకు మంచి అవకాశం. మా కోచింగ్ స్టాఫ్ నుంచి నాకు అందిన సందేశం కూడా ఇదే. నేను ప్రశాంతంగా కనిపిస్తున్నానంటే అది కేవలం కెమెరా కోసమే. ఈ మధ్య కాలంలో నేను ధారళంగా పరుగులిస్తున్నా. అందుకే మోర్నీ మోర్కెల్ సాయంతో మ్యాచ్‌పై పట్టు సాధించేలా బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఫిన్ అలెన్ ఆడిన కొన్ని షాట్లను నేను అస్వాదించాను. కానీ నా బౌలింగ్ ప్లానింగ్ ఇంకా మెరుగ్గా ఉండాల్సింది.

న్యూజిలాండ్ బ్యాటర్లు దూకుడుగా ఆడుతారని మాకు తెలుసు. పవర్ ప్లేలో తర్వాత టీమ్ హడిల్‌లో బాడీ లాంగ్వేజ్ గురించి చర్చ జరిగింది. శక్తివంచన లేకుండా ప్రయత్నించి న్యూజిలాండ్‌ను 180 పరుగుల లోపే కట్టడి చేయాలని అనుకున్నాం. వ్యక్తిగత ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. కానీ పరిపూర్ణమైన టీమ్ గేమ్ ఇంకా రాలేదు. అది ప్రపంచకప్‌లో వస్తుందని ఆశిస్తున్నా.'అని అర్ష్‌దీప్ సింగ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 271 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(43 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్‌లతో 103) సెంచరీతో చెలరేగగా.. సూర్యకుమార్ యాదవ్(30 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకోబ్ డఫీ(1/53), కైల్ జెమీసన్(1/59), మిచెల్ సాంట్నర్(1/60) హాఫ్ సెంచరీలు సమర్పించుకోగా. లాకీ ఫెర్గూసన్(2/41) కాస్త కట్టడిగా బౌలింగ్ చేశాడు.
న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 225 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఫిన్ అలెన్(38 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 80) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(5/51) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. అక్షర్ పటేల్(3/33) మూడు వికెట్లు తీసాడు. వరుణ్ చక్రవర్తీ(1/36), రింకూ సింగ్(1/7) తలో వికెట్ పడగొట్టారు. బౌండరీల వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో భారత్ 23 సిక్సర్లతో పాటు 17 ఫోర్లు బాదగా.. న్యూజిలాండ్ 13 సిక్సర్లు, 19 ఫోర్లు కొట్టింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications