సౌతాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చెత్త బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు. ఒకే ఓవర్లో ఏకంగా ఏడు వైడ్లు వేశాడు. న్యూచంఢీగడ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ ఏడు వైడ్లతో ఒకే ఓవర్‌లో 13 బంతులు వేసాడు. ఈ ఓవర్ తొలి బంతికి డికాక్ భారీ సిక్సర్ కొట్టగా.. మరుసటి రెండు బంతులను వైడ్‌గా సంధించాడు.
తర్వాతి బంతి డాట్ బాల్ కాగా.. వరుసగా నాలుగు వైడ్స్ వేసాడు. తర్వాతి మూడు బంతుల్లో 1, 2, 1 పరుగులిచ్చిన అర్ష్‌దీప్ సింగ్.. ఆరో బంతికి వైడ్ వేసాడు. ఆఖరి బంతి డాట్ కావడంతో ఈ ఓవర్‌లో మొత్తం 18 పరుగులు వచ్చాయి. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ ప్రదర్శనపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదేం బౌలింగ్ ప్రదర్శన అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.

భారత బౌలర్ల అతిపెద్ద ఓవర్ లిస్ట్
అర్ష్‌దీప్ సింగ్ 13 బంతులు 18 పరుగులు దక్షిణాఫ్రికా న్యూ చండీగఢ్, 2025
ఖలీల్ అహ్మద్ 11 బంతులు 11 పరుగులు శ్రీలంక పల్లెకెలె, 2024
హార్దిక్ పాండ్యా 11 బంతులు 19 పరుగులు ఆస్ట్రేలియా అడిలైడ్, 2016
అర్ష్‌దీప్ సింగ్ 10 బంతులు 13 పరుగులు ఐర్లాండ్ న్యూయార్క్, 2024
అర్ష్‌దీప్ సింగ్ 10 బంతులు 6 పరుగులు వెస్టిండీస్ టరూబా, 2023
అర్ష్‌దీప్ సింగ్ 13 బంతులు 18 పరుగులు దక్షిణాఫ్రికా న్యూ చండీగఢ్, 2025
నవీన్-ఉల్-హక్ 13 బంతులు 19 పరుగులు జింబాబ్వే హరారే, 2024
సిసాండ మగాలా 12 బంతులు 18 పరుగులు పాకిస్తాన్ జోహన్నెస్‌బర్గ్, 2021
మార్క్ అడైర్ 11 బంతులు 26 పరుగులు ఆస్ట్రేలియా బ్రిస్బేన్, 2022
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 213 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(46 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90) సత్తా చాటగా.. డోనవన్ ఫెర్రెయిరా(30 నాటౌట్), డేవిడ్ మిల్లర్(20 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(2/29) రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు.