సౌతాఫ్రికా గడ్డపై సంచలన ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. ఆల్‌టైమ్ రికార్డ్స్‌పై కన్నేసాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగు టీ20ల సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేసిన అర్ష్‌దీప్ సింగ్.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన భారత పేసర్‌గా నిలిచాడు.
ఈ క్రమంలో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు భువన్వేశర్ కుమార్‌లను అర్ష్‌దీప్ సింగ్ అర్ష్‌దీప్ సింగ్ సాధించాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచిన టీమిండియా.. సిరీస్ విజయంపై కన్నేసింది. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ప్రారంభమయ్యే నాలుగో టీ20లో ఆతిథ్య సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌కు సిరీస్ దక్కనుంది. ఓడితే మాత్రం సమం కానుంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తినెలకొంది.

అయితే చివరి టీ20లో అర్ష్‌దీప్ సింగ్ 5 వికెట్లు తీస్తే రెండు ఘనతలను తన ఖాతాలో వేసుకోనున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అర్ష్‌దీప్ సింగ్ ఇప్పటివరకు 59 మ్యాచ్‌లు 92 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా.. తొలి పేసర్‌గా కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో యుజ్వేంద్ర చాహల్ 96 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 80 మ్యాచ్‌ల్లో చాహల్ఈ ఫీట్ సాధించాడు. సౌతాఫ్రికాతో చివరి మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ 5 వికెట్లు తీస్తే చాహల్‌ను అధిగమిస్తాడు.
అంతేకాకుండా అంతర్జాతీయ టీ20ల్లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా గుర్తింపుపొందుతాడు. ఈ రికార్డు భువనేశ్వర్ కుమార్ పేరిట ఉంది. అతను 2022లో 32 మ్యాచ్‌లు ఆడి 37 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది అర్ష్‌దీప్ సింగ్ 17 మ్యాచ్‌లు ఆడి 33 వికెట్లు తీసాడు. సౌతాఫ్రికాతో జరిగే నాలుగో టీ20నే ఈ ఏడాది టీమిండియా ఆఖరి టీ20. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్ల ఘనతను అందుకుంటే భువీ రికార్డును అధిగమిస్తాడు. అర్ష్‌దీప్ సింగ్ 2022లో 33, 2023లో 26 వికెట్లు తీసాడు.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు:
1. యుజ్వేంద్ర చాహల్ - 80 మ్యాచ్‌లు - 96 వికెట్లు
2. అర్ష్‌దీప్ సింగ్ - 59 మ్యాచ్‌లు - 92 వికెట్లు
3. భువనేశ్వర్ కుమార్ - 87 మ్యాచ్‌లు - 90 వికెట్లు
4. జస్‌ప్రీత్ బుమ్రా - 70 వికెట్లు - 89
5. హార్దిక్ పాండ్యా - 108 మ్యాచ్‌లు - 88 వికెట్లు