Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2025: చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్!

టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా ఒమన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఈ ఫీట్ సాధించాడు. జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం అందుకున్న అర్ష్‌దీప్ సింగ్.. ఆఖరి ఓవర్‌లో ఒమన్ బ్యాటర్ వినాయక్ శుక్లా(1)ను ఔట్ చేసి అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు.

64 మ్యాచ్‌ల్లో అర్ష్‌దీప్ సింగ్ ఈ ఫీట్ సాధించడం గమనార్హం. ఈ జాబితాలో అర్ష్‌దీప్ సింగ్ తర్వాత యుజ్వేంద్ర చాహల్(80 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు), హార్దిక్ పాండ్యా(116 మ్యాచ్‌ల్లో 95 వికెట్లు),జస్ప్రీత్ బుమ్రా(72 మ్యాచ్‌ల్లో 92 వికెట్లు), భువనేశ్వర్ కుమార్(87 మ్యాచ్‌లలో 90 వికెట్లు) కొనసాగుతున్నారు.ఈ మ్యాచ్‌లో టీమిండియా 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో గ్రూప్-ఏ టాపర్‌గా టీమిండియా సగర్వంగా సూపర్-4‌కు చేరింది.

Arshdeep Singh Makes History Becomes First Indian Bowler to Take 100 T20I Wickets

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. సంజూ శాంసన్(45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26), తిలక్ వర్మ(18 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 29) దూకుడుగా ఆడారు. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్(2/23), జితేన్(2/33), అమీర్ కలీమ్(2/31) రెండేసి వికెట్లు తీసారు.

అనంతరం ఒమన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 167 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఒమన్ బ్యాటర్లలో అమీర్ కలీమ్(46 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 64), హమ్మద్ మిర్జా(33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. కెప్టెన్ జతిందర్ సింగ్(33 బంతుల్లో 5 ఫోర్లతో 32) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ తలో వికెట్ తీసారు. ఈ మ్యాచ్‌ను టీమిండియా పూర్తిగా సన్నాహకంగా ఉపయోగించుకుంది. అందరికి బ్యాటింగ్ ఇవ్వడంతో పాటు బౌలింగ్ ఇచ్చింది.

Story first published: Saturday, September 20, 2025, 0:22 [IST]
Other articles published on Sep 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+