Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: మ్యాచ్ విన్నర్‌పై వేటు.. సౌతాఫ్రికాతో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. మరో ఆసక్తికర సిరీస్‌కు సిద్దమైంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా కటక్ వేదికగా మంగళవారం రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో ఆతిథ్య భారత్‌తో పాటు సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి.

అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ ముందు జరుగుతున్న ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకంగా మారింది. టీ20ల్లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా.. అదే దూకుడు కనబర్చాలని భావిస్తుండగా.. డిఫెండింగ్ ఛాంపియన్‌కు దిమ్మతిరిగే షాకివ్వాలని సౌతాఫ్రికా పట్టుదలతో ఉంది. దాంతో ఈ తొలి టీ20 మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా రీఎంట్రీ..

గాయాలతో భారత జట్టుకు దూరమైన టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రీఎంట్రీ ఇచ్చారు. కటక్ టీ20తో మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ ఇద్దరి రాకతో టీమిండియా బలం పెరగ్గా.. టీమ్ కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Arshdeep Singh Likely to Replace Kuldeep Yadav in India s Playing XI for 1st T20I vs South Africa

మెడ నొప్పితో సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌తో పాటు టీ20 సిరీస్‌కు దూరమైన శుభ్‌మన్ గిల్.. అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. దేశవాళీ క్రికెట్‌ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ప్రస్తుతం అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో ఆడనుండగా.. హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మ నాలుగో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. గత కొంత కాలంగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్‌కు ఈ సిరీస్ కీలకంగా మారనుంది. అతనిపై విమర్శలు తగ్గాలంటే బ్యాట్ ఝులిపించాల్సిందే.

కుల్దీప్ యాదవ్‌పై వేటు..?

పేస్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే ఆడనుండగా.. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్ స్పిన్నర్లుగా ఆడనున్నారు. వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌కు అవకాశం దక్కనుంది. హిట్టర్ గురించి ఆలోచిస్తే జితేష్ శర్మ తుది జట్టులోకి వస్తాడు. స్పెషలిస్ట్ పేస్ బౌలర్‌గా బుమ్రా ఆడనున్నాడు. ఒకవేళ అర్ష్‌దీప్ సింగ్‌ను ఆడించాలనుకుంటే కుల్దీప్ యాదవ్‌‌పై వేటు పడుతుంది. సౌతాఫ్రికాతో మూడో వన్డేలో కుల్దీప్ యాదవ్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చాడు. కానీ టీమ్ కాంబినేషన్‌లో భాగంగా అతను బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి.

భారత్ తుది జట్టు(అంచనా)

శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ/సంజూ శాంసన్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్/అర్ష్‌దీప్ సింగ్

భారత టీ20 టీమ్

శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ,సంజూ శాంసన్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.

Story first published: Monday, December 8, 2025, 12:38 [IST]
Other articles published on Dec 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+