For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs PBKS:రన్ తీయకుండా బ్యాటర్లు ముచ్చట్లు.. రనౌట్ చేసిన పంత్ (వైరల్ వీడియో)

Arshdeep Singh hilariously run out by Rishabh Pant after walking out to talk to non-striker

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ పేలవ బ్యాటింగ్‌తో పంజాబ్ ఘోర పరాజయం పాలవ్వగా.. ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్నందుకుంది. అయితే పంజాబ్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అర్షదీప్ సింగ్ రనౌట్ అయిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రొఫెషనల్ క్రికెట్‌లో బ్యాటర్లు ఇంత అలసత్వంగా ఉంటారా? అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది ఏమాత్రం స్థాయికి తగినది కాదని చురకలంటిస్తున్నారు. ఇక స్మార్ట్‌గా వ్యవహరించిన రిషభ్ పంత్‌ను మెచ్చుకుంటున్నారు.

అసలేం జరిగిందంటే..?

ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో చివరి బంతిని అర్షదీప్ సింగ్ (17 బంతుల్లో 2ఫోర్లతో 9) భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ముస్తాఫిజుర్ వైడ్ యార్కర్ వేయడంతో అర్షదీప్ బంతిని టచ్ చేయలేకపోయాడు. సాధారణంగా ఐపీఎల్‌లో ఆఖరి బంతిని బ్యాటర్ సరిగా కనెక్ట్ చేయకపోయినా.. సింగిల్ కోసం ప్రయత్నిస్తుంటారు. దాంతో.. వారిని రనౌట్ చేసేందుకు వికెట్ కీపర్ ఆఖరి బంతికి ముందే ఒక గ్లోవ్ తీసేస్తుంటారు. కానీ.. పంజాబ్‌తో మ్యాచ్‌లో రిషభ్ పంత్ ఆ పని చేయలేదు. అర్షదీప్ సింగ్ సింగిల్ కోసం ప్రయత్నించినా.. వైభవ్ అరోరా స్పందించలేదు.

పిచ్ మధ్యలో ముచ్చట్లు..

పిచ్ మధ్యలో ముచ్చట్లు..

దాంతో పిచ్ మధ్యలోకి వచ్చిన అర్షదీప్.. వైభవ్ అరోరా స్పందించకపోవడం‌తో నెమ్మదిగా నడుచుకుంటూ ముందుకు వెళ్లాడు. మరోవైపు పంత్ బంతిని అందుకుని.. రనౌట్ కోసం వస్తున్నా.. అర్షదీప్ సింగ్ వెనక్కి వెళ్లేందుకు ఇష్టపడలేదు. అలానే ముందుకు వచ్చి పిచ్ మధ్యలో వైభవ్ అరోరాతో మాట్లాడుతూ కనిపించాడు. దాంతో.. నింపాదిగా రిషభ్ పంత్ రనౌట్ చేశాడు. దాంతో పంజాబ్ కింగ్స్ ఆలౌటైంది. వాస్తవానికి ఐపీఎల్‌లో ప్రతి పరుగు, ప్రతి వికెట్ కీలకమే. జట్లు సమాన పాయింట్లతో నిలిచినప్పుడు నెట్ రన్‌రేట్‌‌ ఆధారంగా పాయింట్ల పట్టికలో స్థానాల్ని కేటాయిస్తారు.

మెరుగైన ఢిల్లీ రన్‌రేట్

మెరుగైన ఢిల్లీ రన్‌రేట్

పంజాబ్‌ని ఆలౌట్ చేసిన ఢిల్లీ.. లక్ష్యాన్ని 10.3 ఓవర్లలోనే ఛేదించడంతో.. ఏకంగా +0.942 రన్‌రేట్‌తో నిలిచింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో మరే జట్టుకీ ఇంత మెరుగైన రన్‌రేట్‌ లేదు. అదీ ఒక్క మ్యాచ్‌లోనే ఢిల్లీ టీమ్ +0.219 నుంచి +0.942‌కి చేరుకోవడం గమనార్హం. ఒక బౌలర్‌గా అర్షదీప్ సింగ్‌‌కు వికెట్ విలువ తెలియదా? అని నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. కనీసం రనౌటవ్వకుండా ప్రయత్నించాల్సిందని అభిప్రాయపాడుతున్నారు.

చిత్తుగా ఓడిన పంజాబ్

చిత్తుగా ఓడిన పంజాబ్

ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులకు కుప్పకూలింది. యువ ప్లేయర్ జితేశ్ శర్మ(23 బంతుల్లో 5 ఫోర్లు 32), మయాంక్ అగర్వాల్(15 బంతుల్లో 4 ఫోర్ల‌తో 24) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలోకుల్దీప్‌ యాదవ్‌ (2/24), ఖలీల్‌ అహ్మద్‌ (2/21), అక్షర్‌ పటేల్‌ (2/10), లలిత్‌ యాదవ్‌ (2/11)రెండేసి వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 10.3 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 119 పరుగులు చేసి 57 బంతులు మిగిలుండగానే గెలుపొందింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(30 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌‌తో 60 నాటౌట్), పృథ్వీ షా(20 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 41) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. రాహుల్ చాహర్‌కు ఓ వికెట్ దక్కింది.

Story first published: Thursday, April 21, 2022, 12:08 [IST]
Other articles published on Apr 21, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+