Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: అఫ్గాన్ చిత్తు.. సిరీస్ భారత్ కైవసం!

వన్డే ప్రపంచకప్ 2027 సన్నద్ధతను భారత్ ఘనంగా ప్రారంభించింది. సొంతగడ్డపై అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. బుధవారం లక్నో వేదికగా ఏకపక్షంగా ముగిసిన రెండో వన్డేలో సమష్టిగా రాణించిన భారత్ 170 పరుగుల భారీ తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో భారత్ ఆధిపత్యం చెలాయించగా.. అఫ్గాన్ తేలిపోయింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 154), ఇషాన్ కిషన్(79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 125) సెంచరీలతో చెలరేగారు. రోహిత్ శర్మ(39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. అఫ్గాన్ బౌలర్లలో ఖరోటే(4/76) నాలుగు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్(3/48) మూడు వికెట్లు పడగొట్టాడు. అల్లా ఘజన్‌ఫర్, మహమ్మద్ సలీమ్ చెరో వికెట్ తీసారు.

Arshdeep Singh and Gurnoor Sizzling 3-Wicket Hauls Crush Afghanistan as India Win by 170 Runs

అనంతరం అఫ్గానిస్థాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులకు కూప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రెహ్మాత్ షా(88 బంతుల్లో 8 ఫోర్లతో 79) ఒంటరి పోరాటం చేయగా.. రెహ్మానుల్లా గుర్బాజ్(33 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 41), సెదిఖుల్లా అటల్(50 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 42) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ మూడేసి వికెట్లు తీయగా.. ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్‌కు ఒక వికెట్ దక్కింది. దార్విష్ రసూలి(6) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే శనివారం జరగనుంది.

రఫ్ఫాడించిన పంజాబ్ త్రయం..

కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ అద్భుత ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ ముగ్గురు పంజాబ్‌కు చెందిన ఆటగాళ్లే కావడంతో నెటిజన్లు బల్లే బల్లే అంటూ కామెంట్ చేస్తున్నారు. గిల్ సెంచరీతో కదం తొక్కితే.. అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ తీన్మార్ బౌలింగ్‌తో సత్తా చాటారు.

Story first published: Wednesday, June 17, 2026, 21:36 [IST]
Other articles published on Jun 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+