Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Arjun Tendulkar: సచిన్ కొడుకు సంచలన బ్యాటింగ్!

ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2024లో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ దుమ్మురేపాడు. ఎలైట్ గ్రూప్ సీ‌లో భాగంగా చండీఘర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గోవా తరఫున బరిలోకి దిగిన అర్జున్ టెండూల్కర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో విలువైన పరుగులు చేశాడు. 60 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70 పరుగులు చేసి గోవాల్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఏడో వికెట్‌కు 127 పరుగులు జోడించాడు.

సచిన్ కొడుకు సూపర్ బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గోవా 160 ఓవర్లలో 7 వికెట్లకు 618 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. సుయాశ్ ప్రభుదేశాయ్(364 బంతుల్లో 18 ఫోర్లు, సిక్స్‌తో 197) తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకోగా.. దీప్‌రాజ్ గోయంకర్(101 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 115 నాటౌట్) అజేయ శతకంతో రాణించాడు. అర్జున్ టెండూల్కర్‌తో పాటు కృష్ణమూర్తి సిద్దార్థ్(159 బంతుల్లో 9 ఫోర్లతో 77) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

 Arjun Tendulkar smashes quickfire fifty against Chandigarh in Ranji Trophy 2024

చండీఘడ్ బౌలర్లలో జగిత్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. రాజ్ బవా, అర్పిత్ పన్ను, అర్స్‌లన్ ఖాన్, కునాల్ మహజాన్ తలో వికెట్ తీసారు. మూడు పరుగుల వ్యవధిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్న సుయాశ్ ప్రభుదేశాయ్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా ఆర్‌సీబీ అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. ఐపీఎల్‌లో సుయాశ్ ప్రభుదేశాయ్‌ ఆర్‌సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

ఇప్పటికే ఆర్‌సీబీకి చెందిన రజత్ పటీదార్ శతకం సాధించాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న అనాధికారిక టెస్ట్‌లో అతను సత్తా చాటాడు. రంజీ ట్రోఫీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు కూడా సత్తా చాటుతున్నారు. 6 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన భువనేశ్వర్ కుమార్ తన ఫస్ట్ మ్యాచ్‌లోనే 8 వికెట్లతో సత్తా చాటాడు.

యూపీకి ప్రాతినిథ్యం వహిస్తున్న భువనేశ్వర్ కుమార్ ఎలైట్ గ్రూప్ బీలో భాగంగా బెంగాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టాడు. దాంతో బెంగాల్ 188 పరుగులకు కుప్పకూలింది. కర్ణాటక కెప్టెన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్(124 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్‌తో 109) సెంచరీతో చెలరేగాడు. అతని శతకంతో కర్ణాటక భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది.

Story first published: Saturday, January 13, 2024, 17:40 [IST]
Other articles published on Jan 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+