IPL 2021 వేలం బరిలో అర్జున్.. కనీస ధర ఎంతో తెలుసా?! రేసులో విహారి, పుజారా!

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్‌కు ముందు నిర్వహించే వేలం సందడి అప్పుడే మొదలైంది. ఈ నెల 18న చెన్నైలో జరగనున్న ఈ వేలంలో పాల్గొనేందుకు మొత్తం 1097 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. శుక్రవారం ఆ వివరాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వెల్లడించింది. అయితే భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఈ వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. కనీస ధర రూ.20 లక్షలకు అర్జున్ వేలంలో పాల్గొనబోతున్నాడు. ముంబై ఇండియన్స్ అతడిని కొనుగోలు చేసే అవకాశం ఉంది.

75 లక్షలతో శ్రీశాంత్:
వివాదాస్పద భారత క్రికెటర్ ఎస్ శ్రీశాంత్ ఐపీఎల్ టీ20 టోర్నమెంట్‌లో మళ్లీ ఆడేందుకు తహతహలాడుతున్నాడు. ఈ సీజన్ కోసం నిర్వహించే వేలంలో పాల్గొనేందుకు రూ. 75 లక్షల కనీస ధరతో తన పేరు నమోదు చేసుకున్నాడు. అయితే పోటీ తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఫిక్సింగ్ ఆరోపణలున్న అతనిపై ఏ ఫ్రాంచైజీ కన్నెత్తి చూస్తోందో వేచి చూడాలి. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో దాదాపు ఏడేళ్లుగా క్రికెట్‌కు దూరమైన శ్రీశాంత్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ఆడిన విషయం తెలిసిందే. 2013 ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతూ.. స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో ఇరుకున్నాడు.

విహారి, పుజారా కూడా:
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ ఆటగాళ్లు హనుమ విహారి, చేటేశ్వర్ పుజారా కూడా ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో అందుబాటులో ఉండనున్నారు. విహారి కనీస ధర రూ.1 కోటి కాగా.. పుజారా కనీస ధర రూ.50 లక్షలుగా ఉంది. టెస్టు స్పెషలిస్ట్ ఆటగాళ్లగా ముద్రపడిన వీరిని ఏ ప్రాంచైజీ కొనుగోలుచేస్తుందో చూడాలి. విహారి, పుజారా ఇద్దరు ఆటగాళ్లు ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన టెస్ట్ సిరీస్‌లో ఆడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుతో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పుజారా ఆడుతుండగా.. గాయం కారణంగా విహారి ఆడట్లేదు.

2 కోట్లతో స్మిత్, మాక్స్‌వెల్:
ప్రస్తుత నంబర్‌వన్ టీ20 ఆటగాడు డేవిడ్ మలన్ (రూ.1.5 కోట్లు) ఐపీఎల్ అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యాడు. హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, షకీబుల్ హసన్, మొయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్, లియామ్ ప్లంకెట్, జేసన్ రాయ్, మార్క్ వుడ్, ఇంగ్రామ్ కనీస ధర రూ. 2 కోట్లతో ఉన్నారు. ఇక మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), జేమ్స్ ప్యాటిన్సన్ (ఆస్ట్రేలియా), జో రూట్ (ఇంగ్లండ్) లాంటి అంతర్జాతీయ స్టార్లు ఈ వేలంలో పాల్గొనడం లేదు. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీల్లో కేవలం 61 ఖాళీలే ఉన్న ఈ సీజన్ కోసం 1097 మంది ఆటగాళ్లు వేలంలో పోటీపడుతున్నారు. అవకాశం ఎవరిని వరిస్తుందో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
ISL 2020 21: గోల్ లేకుండానే ముగిసిన మ్యాచ్!!